చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాల్లో స్టాలిన్ ఒకటి. తమిళ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మంచి సామాజిక సందేశం కూడా ఉంది. అందుకే 2006లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఖుష్బూ చిరంజీవి అక్కగా నటించింది. అలాగే ప్రకాశ్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సుమారు 19 ఏళ్ల తర్వాత స్టాలిన్ సినిమా రీరిలీజ్ కాబోతుంది. శుక్రవారం (ఆగస్టు 22) ఈ మూవీ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. దీంతో మెగా ఫ్యాన్స్ నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. ఇదే క్రమంలో స్టాలిన్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో పై ఫొటో కూడా ఉంది. అందులో చిరంజీవి, డైరెక్టర మురగదాస్ లతో పాటు ఉన్న ఓ కుర్రాడిని గమనించారా? అతను ఇప్పుడు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్. ముఖ్యంగా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. బాలకృష్ణ, రవితేజ, వెంకటేష్, రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్ తదితర హీరోలతో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. ఇటీవలే బాలీవుడ్ లోనూ ఓ సూపర్ హిట్ సినిమాను తీసి హిట్ కొట్టాడు. ఈ పాటికే చాలామందికి అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. అతను మరెవరో కాదు బాలయ్యతో వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన గోపీచంద్ మలినేని
ఒంగోలు సమీపంలోని బొద్దులూరివారి పాళెంలో గోపీచంద్ మలినేని జన్మించాడు. స్వగ్రామంలో 10వ తరగతి వరకు చదువుకున్న అతను నెల్లూరులోని వి.ఆర్. కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. సినిమాలపై ఆసక్తి ఉండడంతో కెమెరా అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత దివంగత నటుడు శ్రీహరి హీరోగా నటించిన పోలీస్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ, శ్రీను వెట్ల, మురుగదాస్, శ్రీవాస్ తదితర దర్శకుల వద్ద కూడా పనిచేశాడు. ఈ క్రమంలోనే వెంకీ, ఢీ, లక్ష్యం, స్టాలిన్, కంత్రి, బిల్లా దితర సినిమాలకు కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత రవితేజ డాన్ శీను సినిమాతో డైరెక్టర్ గా మారాడు.
ఇవి కూడా చదవండి
వెంకటేశ్ తో బాడీ గార్డ్, రవితేజతో బలుపు, క్రాక్, రామ్ పోతినేనితో పండగ చేస్కో, సాయి ధరమ్ తేజ్ తో విన్నర్ సినిమాలను తెరకెక్కించాడు గోపీచంద్. ఇక బాలయ్యతో కలిసి తీసిన వీర సింహారెడ్డి సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయాడు. ఈ ఏడాది గోపీచంద్ బాలీవుడ్ లో తీసిన జాట్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి బాలయ్యతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్.
బాలయ్యతో గోపీచంద్ మలినేని..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి