జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి..? చాలా మంది పేరెంట్స్ చేసే పొరబాటు అదే..

జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి..? చాలా మంది పేరెంట్స్ చేసే పొరబాటు అదే..


వాతావరణంలో మార్పులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా చాలా మంది పిల్లలు జ్వరం, జలుబు వంటి ఆరోగ్య సమస్యలకు పదే పదే గురవుతుంటారు. ఇలాంటి పిల్లలు సరిగ్గా తినరు. దీని కారణంగా పిల్లల ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఇటువంటి సమయాల్లో జ్వరం ఉన్న పిల్లలకు ఏ విధమైన ఆహారాలు ఇవ్వాలి అనే విషయంలో సందేహాలు తలెత్తుతాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారం శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఇవ్వాల్సిన ఆహారాలు ఇవే..

సూప్

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు సూప్ ఇవ్వడం చాలా మంచిది. సూప్‌లో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది పోషకమైన ఆహారంగా మారుతుంది. ఇది పిల్లలు జ్వరం నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది. దీనితో పాటు పిల్లలు కూడా రాగి అంబలిని తాగవచ్చు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న పిల్లలు రాగి అంబలిని తాగడం మంచిది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది సులభంగా జీర్ణమవుతుంది.

ద్రవ ఆహారాలు

జ్వరం సమయంలో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. కాబట్టి పిల్లలకు నీరు అధికంగా అందించడం చాలా ముఖ్యం. ఇటువంటి పరిస్థితిలో నీరు, కొబ్బరి నీళ్లు ఇవ్వడం వల్ల పిల్లల శరీరంలో నిర్జలీకరణం తొలగిపోతుంది. పెరుగు కూడా ఇవ్వవచ్చు. ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

సీజనల్ పండ్లు

జ్వరం సమయంలో శరీరానికి ఎక్కువ విటమిన్లు, శక్తి అవసరం. కాబట్టి పిల్లలకు సీజనల్ పండ్లను ఇవ్వాలి. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. సులభంగా జీర్ణమవుతుంది. కడుపుకు తేలికగా ఉండేందుకు ఆపిల్స్, బేరి పండ్లను కూడా పిల్లలకు తినడానికి ఇవ్వవచ్చు. బొప్పాయి, నారింజ పండ్లు తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు పుచ్చకాయ ఇవ్వడం వల్ల వారి శరీరంలో నీటి శాతం పెరిగి జ్వరం నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

ఏ ఆహారాలు తినకూడదు..

జ్వరం ఉన్న సమయంలో పిల్లలకు కొన్ని ఆహారాలు ఇవ్వకూడదు. ఎందుకంటే అవి జీర్ణం కావడం కష్టం. ఇది పిల్లల ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. అందువల్ల జ్వరం ఉన్న సమయంలో పిల్లలకు కారంగా, నూనెతో కూడిన, వేయించిన ఆహారాలు, చాక్లెట్, కుకీలు, ఇతర తీపి పదార్థాలు ఇవ్వకూడదు. అలాగే వారికి చల్లని పానీయాలు ఇవ్వడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *