సినిమా కథల ఎంపికలో ఒక్కో హీరోకు ఒక్కో అంచనా ఉంటుంది. చాలా సార్లు ఆ అంచనాలు కరెక్ట్ అవ్వొచ్చు… మరికొన్ని సార్లు రాంగ్ కావొచ్చు. అందుకే సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారుతూ ఉంటాయి. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో సినిమా చేయడమన్నది తరచూ జరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు అలా చేతులు మారిన సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. మరికొన్ని సార్లు ఫ్లాఫ్ అవుతుంటాయి. పాన్ ఇండియా హీరోలు హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ ల విషయంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఓ కథతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీతోనే బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. లవర్ బాయ్ గా అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అలాగే యూత్ లోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు ఈ మూవీని తెరకెక్కించాడు. అయితే ముందుగా ఈ సినిమా కోసం ఆయన పలువురు హీరోలను సంప్రదించారట. అందులో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడట. అయితే అప్పటికే డార్లింగ్ సినిమా డైరీ ఫుల్ అవ్వడంతో సింపుల్ గా ఈ సినిమాను పక్కన పెట్టేశారట. ఒక్క ప్రభాసే కాదు నితిన్, మాస్ మహారాజా రవితేజ తదితర హీరోలు కూడా వివిధ కారణాలతో ఈ మూవీని రిజెక్ట్ చేశారట. చివరకు అల్లు అర్జున్ దగ్గరకు ఈ మూవీ వెళ్లిందట. బన్నీ వెంటనే ఒకే చెప్పడంతో సినిమా షూటింగ్ పట్టాలెక్కిందట. ఇక ఆ తర్వాత చెప్పేదేముంది. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అలా ప్రభాస్ మిస్ చేసుకున్న ఆ మూవీ మరేదో కాదు ఆర్య.
ఇవి కూడా చదవండి
గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీకి మొదటి సినిమా మంచి ఫలితాన్నే ఇచ్చింది. దీని తర్వాత ఆర్య తో మరో హిట్ కొట్టాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీకి యూత్ ఫిదా అయిపోయారు. అయితే సుకుమార్ మొదట ఈ సినిమా కోసం ప్రభాస్ తో పాటు నితిన్, రవితేజలను సంప్రదించారట. అయితే వివిధ కారణాలతో వారు ఈ మూవీపై పెద్దగా ఆసక్తి చూపించలేదట.
భార్యా, పిల్లలతో అల్లు అర్జున్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి