ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు రోజుకో కొత్తరకం మోసాలతో జనాలకు కుచ్చుటోపీలు పెడుతున్నారు. జనాలు కూడా ఈ మోసగాళ్లను ఈజీగా నమ్మి కస్టపడి సంపాధించి డబ్బును మొత్తం పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అమీర్ పేట్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధుడికి జూన్ నెలలో మాయ రాజ్‌పుత్ అనే మహిళ పేరుతో వాట్సాప్‌లో కాల్స్, మెసేజ్స్ చేశారు స్కామర్స్. ఆయనతో చనువుగా మాట్లాడుతూ, మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్న కేటుగాళ్లు.. చనువు ఏర్పడ్డాక తమ ప్లాన్‌ను అమలు చేయడం స్టార్ట్ చేశారు.
తనతో చాట్ చేస్తున్న మహిళకు ఎన్నో కష్టాలు ఉన్నట్టు.. వైద్య ఖర్చులు, తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను విడిపించాలని.. అందుకు కొన్ని డబ్బులు కావాలని అతనితో చెప్పడం స్టార్ట్ చేశారు. అది నిజమేనని నమ్మిన వృద్దుడు పలు దఫాలుగా తన చాట్ చేస్తున్న కేటుగాళ్లు ఇచ్చిన నంబర్‌కు డబ్బులు పంపడం స్టార్ట్ చేశారు. ఇలా ఆ వృద్ధుడి నుంచి మొత్తం రూ. 7 లక్షల 11 వేలు వరకు కాజేశారు కేటుగాళ్లు.
అక్కడితో ఆగకుండా ఇంకా తమకు డబ్బులు కావాలని కేటుగాళ్లు ఆ వృద్దుడిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు తమ కుటుంబ సభ్యుల సహాయంతో సైబర్ క్రైమ్ పోలీసులకును ఆశ్రయించాడు. జరిగిన విషయం మొత్తం పోలీసులు చెప్పి ఘటనపై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.