విషయం తల్లికి చెప్పగా తన కుమార్తె గత ఆరు సంవత్సరాలుగా తన జుట్టును తానే లాక్కొని తింటుందని తెలిపింది. రిపోర్ట్స్ ఆధారంగా బాలికకు తీవ్రమైన రక్తహీనత ఉందని తేలింది. అంతేకాదు ఆమె కడుపులో వెంట్రుకలన్నీ పెద్ద సైజు బంతులా తయారైనట్లుగా వైద్యులు గుర్తించారు. దీంతో జులై 14న ఆమెకు ఆపరేషన్ చేసి హెయిర్ బాల్ ని తొలగించారు. వైద్యులు ఆమె కడుపు నుండి వెంట్రుకలను బయటకు తీసినప్పుడు అందరూ దాన్ని చూసి షాక్ అయ్యారు. ఆగస్టు 5న చెకప్ కోసం వచ్చిన నిని వైద్యులకు స్వీట్స్ తో చేసిన బోకేను అందజేసి కృతజ్ఞతలు తెలిపింది. తన కుమార్తె బరువు పెరుగుతుందని బాగానే కోలుకుంటుందని ఆమె తల్లి చెప్పారు. గతంలో జైపూర్ లోని సావాయ్ మాన్సింగ్ ఎస్ ఎం ఎస్ ఆసుపత్రిలో ఇలాంటి కేసు నమోదైంది. ఇక్కడ 14 ఏళ్ల బాలిక కడుపు నుండి 210 సెంటీమీటర్ల పొడవున్న వెంట్రుకలను తొలగించారు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నివాసి అయిన ఈ 14 ఏళ్ల బాలిక దాదాపు ఒక నెల నుండి కడుపు నొప్పి వాంతులతో బాధపడుతున్నట్లుగా తల్లిదండ్రులు చెప్పారు. వైద్యులు ఆమెను పరీక్షించినప్పుడు ఆమె కడుపులో చాలా గట్టి పొడవైన గడ్డ ఉందని గుర్తించారు. అనంతరం ఆపరేషన్ చేసి కడుపులో పేరుకుపోయిన వెంట్రుకలను తొలగించారు. అప్పట్లో కడుపులో నుండి తొలగించబడిన అతి పొడవైన వెంట్రుకల ముద్ద ఇదేనని చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం
భాగస్వామి కోపంగా ఉన్నరా.. ఈ తప్పులు అస్సలే చేయకండి వీడియో!