S Jaishankar: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. ఏం చర్చించారంటే?

S Jaishankar: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. ఏం చర్చించారంటే?


మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ గురువారం మాస్కోలోని క్రెమ్లిన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై జైశంకర్ పుతిన్‌తో చర్చించారు. రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య జరగనున్న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాట్లు, అంతర్జాతీయ పరిణామాలు, ఉక్రెయిన్‌లోని తాజా పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. దానితో పాటు ఇటీవల రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారత్‌పై అమెరికా 50శాం సుంకాలు విధించడంపై కూడా చర్చలు జరిగినట్టు ఆయన పేర్కొన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. ఈరోజు క్రెమ్లిన్‌లో అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. భారత రాష్ట్రపతి ముర్ము, ప్రధాన మంత్రి పంపిన హృదయపూర్వక శుభాకాంక్షలను పుతిన్‌కు అందజేసినట్లు జైశంకర్ తెలిపారు. ఈ భేటీకి ముందు రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌లతో తాను జరిపిన చర్చల వివరాలను కూడా పుతిన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు జైశంకర్ తన X ఖాతాలో పోస్ట్ చేశారు.

దీనితో పాటు రష్యా, ఉక్రెయిన్‌ యుద్ద పరిస్థితులపై కూడా ఆయన పుతిన్‌తో చర్చించినట్టు తెలిపారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌ ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై, అంతర్జాతీయ పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన అభిప్రాయాలను తెలియజేసినట్టు పేర్కొన్నాడు. ఆయా పరిస్థితులపై పుతిన్ అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారని ఆయన ఆన్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం జరిగినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *