సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ అనారోగ్యంతో ఆగస్టు 19న కన్నుమూశారు. విషయం తెలియగానే జయకృష్ణ ఇంటికి చేరుకున్న నందమూరి కుటుంబ సభ్యులు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు కూడా పద్మజ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అయితే అలా ఆయన మాట్లాడుతుండగా… సీఎం చంద్రబాబు పక్కనే ఉన్న బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య ఫ్యాన్స్‌ని కలిచివేస్తోంది.