గంధమాదన పర్వతం.. హిమాలయాల్లోని బద్రీనాథ్, మానససరోవర్ మధ్య ఈ పర్వతం ఉందని చెబుతారు. తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ఈ పర్వతం నుంచే హనుమంతుడు లంకకు వెళ్లడానికి సముద్రం దాటారని నమ్ముతారు. ఇక్కడ ఒక రాయిపై హనుమంతుడి పాద ముద్రలు కూడా కనిపిస్తాయి. ఈ పర్వతంపై ఆయన ఇప్పటికీ ధ్యానం చేస్తూ ఉంటారని.. అందుకే ఈ ప్రదేశం చాలా శక్తివంతమైనదని అంటారు.
హిమాలయాలు, గుహలు.. హిమాలయాలకు కూడా హనుమాన్ కు సంబంధం ఉందని చెబుతారు. హిమాచల్ ప్రదేశ్ లోని హనుమాన్ టిబ్బా, ఉత్తరాఖండ్‌లోని కొన్ని గుహల్లో ఆయన ధ్యానంలో ఉన్నారని చాలా మంది నమ్ముతారు.
మానససరోవర్ సరస్సు.. టిబెట్ లో ఉన్న మానససరోవర్ సరస్సు శివుడికి శక్తి కేంద్రమే కాకుండా.. హనుమాన్కు కూడా ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడకు వెళ్లిన భక్తులు, సాధువులు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను, దైవశక్తిని అనుభూతి చెందుతారు.
చిత్రకూట్ హనుమాన్ ధార.. చిత్రకూట్‌లోని హనుమాన్ ధార దగ్గర కూడా భక్తులు హనుమాన్ శక్తిని అనుభవిస్తారు. సీతను వెతుకుతున్నప్పుడు ఆయన ఒంటిపై ఉన్న అగ్నిని ఇక్కడ చల్లార్చుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.
పంచముఖి హనుమాన్ ఆలయం.. రామేశ్వరంలోని ఈ గుడిలో ఐదు ముఖాల హనుమంతుడిని పూజిస్తారు. మహిరావణుడిని చంపేటప్పుడు హనుమాన్ ఐదు ముఖాలు ధరించారని చెబుతారు. ఈ గుడి చెడు శక్తుల నుంచి రక్షిస్తుందని నమ్మకం.
హనుమాన్ గఢీ, అయోధ్య.. అయోధ్యలోని ఈ గుడి గురించి ఒక కథ ఉంది. రాముడి నగరాన్ని కాపాడడానికి హనుమాన్ ఇక్కడే ఉంటారని ప్రజలు నమ్ముతారు. భక్తులు చేసే ప్రార్థనలు, జైకారాల ప్రభావం ఇక్కడ ఎల్లప్పుడూ ఉంటుంది.
హనుమాన్ ఎందుకు చిరంజీవి..? పురాణం ప్రకారం.. సీత, రాముడు హనుమాన్కు చిరంజీ వి (ఎప్పటికీ బతికి ఉండే వరం) వరం ఇచ్చారు. కలియుగంలో మంచివాళ్లు కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి హనుమాన్ వస్తారని రాముడు ఆజ్ఞాపించాడని చెబుతారు. అందుకే ఎక్కడ రాముడి పేరు చెబుతారో అక్కడ హనుమాన్ ఉంటారని నమ్ముతారు.