ఓల్డ్ స్కూల్ టీ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కేఫ్ బ్రాండ్. కేరళ వీధి మూలలో ఉన్న ఒక చిన్న టీ దుకాణంలో ప్రారంభమైంది. కొట్టాయంలోని తన్నీర్ముక్కంలో ఆవిరి పట్టే కెటిల్, చెక్క బెంచీలు, చిటికెడు జ్ఞాపకాలతో ప్రారంభమైన ఈ సంస్థ.. ఇప్పుడు దేశంలోని అత్యంత పాపులర్ స్వదేశీ కేఫ్ ఫ్రాంచైజీలలో ఒకటిగా ఎదిగింది. తక్కువ ఆర్భాటం, ధైర్యం, దూరదృష్టితో ఓల్డ్ స్కూల్ టీ భారతదేశంలోని కొత్త తరం కోసం టీ దుకాణాన్ని ఆవిష్కరించడానికి బయలుదేరింది.
కొన్ని సంవత్సరాల ప్రయాణంలో ఈ బ్రాండ్ ఇప్పుడు కేరళ, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్‌లలో 50 కి పైగా అవుట్లెట్లను నిర్వహిస్తోంది. ముంబై, దుబాయ్ మ్యాప్‌లో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ షాప్ కి ప్రధాన ఆకర్షణ ప్రపంచ కేఫ్ ట్రెండ్లను అనుసరించడం కాదు. స్థానిక టీ సంస్కృతిని కొత్త తరానికి అందించడం. ఈ కెఫే విస్తరణకు కేంద్ర బిందువు శ్యామ్ కె శశి. మాజీ ప్రభుత్వ ఉద్యోగి. సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలి ప్రీమియం టీలు, కాఫీలు, కమ్యూనిటీ స్థలాలను రోజువారీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావించాడు. టీ షాప్ ని ప్రారంభించాలని కోరుకున్నాడు.
క్లాసిక్ ఛాయాతో పాటు, కోల్డ్ బ్రూలు, ట్విస్ట్‌తో ఫిల్టర్ కాఫీ, హౌస్ స్పెషల్స్ , బ్రాండ్‌కు ప్రత్యేకమైన విచిత్రమైన టేక్‌లు అన్నీ అందుబాటులో ఉండే ధరలకు లభిస్తాయి. ఒక సాధారణ హ్యాంగ్అవుట్ స్పాట్‌గా ప్రారంభమైన ఈ బ్రాండ్ నేడు దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కేఫ్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది ఓల్డ్ స్కూల్ టీ. కేరళ, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్ అంతటా 50 కి పైగా అవుట్లెట్లు, ముంబైలో కొత్త లాంచ్‌లు రావడంతో ఈ ఓల్డ్ స్కూల్ టీ సరికొత్త రికార్డ్ సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి 100 అవుట్లెట్లు లక్ష్యంగా సాగుతోంది. అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలో భాగం దుబాయ్ మొదటి గమ్యస్థానం కావచ్చు.
ఇవి కూడా చదవండి
ఈ కేఫ్ విజయగాథ ఏమిటంటే
ఓల్డ్ స్కూల్ టీ షాప్ కార్పొరేట్ స్టైల్ లుక్ లేదు. ఓల్డ్ స్కూల్ టీ ఒక సాధారణ దుకాణం. పూర్వకాలం జ్ఞాపకాలను గుర్తించే ఆలోచన నుంచి పుట్టింది. సాధారణ ప్రజలకు ప్రీమియం టీ, కాఫీ సంస్కృతిని అందించడం.
కేరళ వీధుల్లో ప్రీమియం యూరోపియన్ కాఫీలను చూడలేరు. అవి ఎక్కువగా స్టార్‌బక్స్ లేదా CCD వంటి ఉన్నత స్థాయి కేఫ్‌లకే పరిమితం. ఈ నేపధ్యంలో తన వెంచర్ లక్ష్యం ఆ కాఫీలను కేరళీయుల దైనందిన జీవితాల్లోకి తీసుకురావడం” అని శ్యామ్ చెప్పారు. శ్యామ్ ఒక ట్రెండ్ ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించ లేదు. అతను ఒక మార్పు కోసం ప్రయత్నించాడు. పట్టణ కేఫ్ లకే పరిమితం అయిన ప్రీమియం టీలు, కాఫీలు చాలా మందికి అందుబాటులో లేవు. కనుక సహాయం వాటిని వీధిలోకి తెచ్చాడు.
ఈరోజు ఏదైనా ఓల్డ్ స్కూల్ టీ షాప్ లోకి అడుగుపెట్టినా అక్కడ రెండు విషయాలను గమనించవచ్చు. రూపం, అనుభూతి. షాప్ లోని చెక్క కుర్చీలు, టైల్స్ వేసిన కౌంటర్లు, రేడియో సెట్లు, తాతగారి గదిలో ఉండే ఫ్రేమ్ చేసిన ఫోటోలు.. అన్నీ కలిపి ఒక సుపరిచితం, వెచ్చదనం కలగలిపి వింతైన ఓదార్పునిస్తుంది. ప్రస్తుతం వేగంగా సాగుతున్న జీవితం నుంచి కేఫ్ లో అడుగు పెట్టిన కష్టమర్ విశ్రాంతి తీసుకోవడానికి ఒక క్షణం అయినా పూర్వకాలంలో జీవించిన అనుభూతిని ఇచ్చే విధంగా ఈ షాప్ లు రూపొందించబడతాయి.
ఫ్రాంచైజింగ్ ఓల్డ్ స్కూల్ టీ విస్తరణకు కీలక స్తంభంగా మారింది. కేవలం ₹3 లక్షల నుంచి ప్రారంభమయ్యే పెట్టుబడి ప్యాకేజీలతో యువ వ్యవస్థాపకులు తమ సొంత అవుట్లెట్లను నడపాలని కోరుకుంటున్నారు.
ఈ ఓల్డ్ స్కూల్ టీ అనేది టీ కంటే చాలా ఎక్కువ. ఇది ఒక జ్ఞాపకం, నేటి ఆధునిక సమాజం .. పూర్వకాలం అనుభూతులను ఆస్వాదించే వీలు కలిగించే ప్రదేశం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..