హైదరాబాద్, ఆగస్ట్ 21: సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2025 ఫలితాలు గురువారం (ఆగస్ట్ 21) మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్లో తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2025 జూన్ సెషన్ పరీక్షలు రాసిన అభ్యర్థుల ఫలితాలు ఈ మేరకు వెల్లడించినట్లు ఎన్టీయే పేర్కొంది. కాగా ఈ ఏడాది జులై 28న దేశ వ్యాప్తంగా ఒకటే రోజున ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 1,95,241 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో మొత్తం 1,47,732 మంది పరీక్షకు హాజరయ్యారు.
సీఎస్ఐఆర్ యూజీసీ నెట్-2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ ఇంటర్ ప్రవేశాల గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాల గడువును మరోమారు పొడిగించారు. తాజా ప్రకటన మేరకు ఆ గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఏపీ ఐటీఐ మూడో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తులు దరఖాస్తులు ఆహ్వానం
2025-26 విద్యా సంవత్సరానికి ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో రెండో విడత కౌన్సెలింగ్ ముగిసింది. ఇక మిగిలిన సీట్లకు మూడో విడత ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్, కన్వీనర్ ఎం కనకారావు ఓ ప్రకటనలో కోరారు. 10వ, 8వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఆగస్టు 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలపి ఆయన సూచించారు. అలాగే ఆగస్ట్ 27వ తేదీ ఉదయం 12 గంటల్లోపు ఆయా ఐటీఐ కాలేజీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయించుకోవాలని అన్నారు. ఇక మూడో విడత కౌన్సెలింగ్ ఆగస్ట్ 29న ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 0866-2475575, 90906-39639, 77804-29468 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.