చిన్న చిన్న విషయాలకే కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి.. తాజాగా.. పబ్జికి బానిసైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలోని భైంసాలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన భేతి సంతోష్ కుటుంబం భైంసాలో ఉంటూ చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. ఆయన కుమారుడు రిషేంద్ర (13) విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు.. ఈ క్రమంలోనే.. రిషేంద్ర పబ్జికి బానిసయ్యాడు. ఎప్పుడూ మొబైల్ ఫోన్ లో పబ్జి ఆడుతూనే ఉండేవాడు.. దీంతో పబ్జి ఆడొద్దంటూ తండ్రి సంతోష్, తల్లి రిషేంద్రను పలు మార్లు మందలించాడు.. అయినా వినకుండా అలానే ఆడుతున్నాడు..
ఈ క్రమంలోనే… పబ్జి ఆడోద్దంటూ రిషేంద్రను తల్లిదండ్రులు మరోసారి మందలించడంతో.. మనస్థాపం చెందిన రిషేంద్ర ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతిలో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.. రిషేంద్ర ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..