జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలసంచారం అనేది సహజం. అయితే శ్రావణ మాసం ముగింపు దశకు వచ్చేసింది. శని వారం రోజున తిథి అమావాస్య. అయితే ఈరోజు శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడటం వలన నాలుగు రాశుల వారికి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయంట.
మిథున రాశి : మిథునరాశి వారికి గజకేసరి రాజయోగం వలన జాక్ పాట్ తగలనుంది. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కష్టాలన్నీ తీరిపోయి ఆనందంగా ఉంటారు. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకొస్తాయి.
సింహ రాశి : గజకేసరి రాజయోగంతో ఈ రాశి వారికి ఆర్థికంగా లక్కు కలిసి వస్తుంది. ధన లాభం కలుగుతుంది. ఖర్చులు తగ్గి చేతిలో డబ్బు నిలవడంతో చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.
మీన రాశి : గజకేసరి రాజయోగం వలన ఈ రాశి వారు కష్టాల నుంచి బయటపడి చాలా ఆనందంగా జీవిస్తారు. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులు అనుకోని విధంగా లాభాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఆనందంగా గడుపుతారు.
కర్కాటక రాశి : గజకేసరి రాజయోగం వలన వీరు ఏ పని చేపట్టినా అందులో విజయం అందుకుంటారు. ఆర్థికంగా అనేక లాభాల చేకూరుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసివస్తుంది.