స్కిప్పింగ్ రోజూ చేస్తే బాడీకి చాలా లాభాలు వస్తాయి. నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఇది కేవలం కేలరీలను బర్న్ చేయడమే కాదు.. కండరాలను స్ట్రాంగ్‌గా చేయడం, గుండె, ఎముకల ఆరోగ్యాన్ని పెంచడం, మైండ్‌ను ఫ్రెష్‌గా ఉంచడం వంటి బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. రోజుకు 15 నుంచి 20 నిమిషాలు చేసినా చాలు. మంచి మార్పు కనిపిస్తుంది.
బరువు తగ్గడం ఎలా..?
- స్లోగా స్కిప్పింగ్ చేసినా కూడా బాడీ చాలా కేలరీలను బర్న్ చేస్తుంది.
- ఫాస్ట్ బర్నింగ్.. ఫాస్ట్‌గా చేస్తే గంటకు 1000 కేలరీల వరకు బర్న్ చేయొచ్చు.
- ఫ్యాట్ కరిగిపోతుంది.. ఈ కేలరీల ఖర్చు శరీరంలో ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. అందుకే బరువు తగ్గడం వేగంగా జరుగుతుంది.
- మంచి షేప్.. ఒకేసారి బాడీలోని చాలా కండరాలు పనిచేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు కండరాలు కూడా బలంగా తయారవుతాయి.
ఇతర వ్యాయామాలతో పోలిస్తే..
స్కిప్పింగ్ చాలా పవర్ ఫుల్ వ్యాయామం. కేవలం 10 నిమిషాలు చేస్తే.. అది 30 నిమిషాలు జాగింగ్ లేదా సైక్లింగ్ చేసినంత ఎనర్జీని ఖర్చు చేస్తుంది.
ఇంకా ఎన్నో లాభాలు
- మెటబాలిజం పెరుగుతుంది.. రోజూ స్కిప్పింగ్ చేస్తే మెటబాలిజం రేటు పెరుగుతుంది. అంటే వ్యాయామం పూర్తయినా కూడా బాడీ కేలరీలను బర్న్ చేస్తూనే ఉంటుంది.
- స్టామినా పెరుగుతుంది.. స్కిప్పింగ్ ఒకేసారి కాళ్లు, చేతులు, భుజాలు, పొట్ట, వెన్ను కండరాలను పని చేయిస్తుంది. అందుకే కండరాలు బలంగా మారి, మీ స్టామినా కూడా పెరుగుతుంది.
- గుండె ఆరోగ్యం.. స్కిప్పింగ్ వల్ల గుండె వేగం పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. దీంతో గుండె కండరాలు బలంగా మారతాయి.
- ఎముకలకు బలం.. ఇది ఒక బరువు మోసే వ్యాయామం కాబట్టి.. ఎముకలపై కొంచెం ఒత్తిడి ఏర్పడి వాటి బలం పెరుగుతుంది.
- మెంటల్ హెల్త్.. స్కిప్పింగ్ చేసినప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్స్ స్ట్రెస్, ఆందోళనలను తగ్గిస్తాయి. దాంతో మనసు ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటుంది.
- బాడీ సమన్వయం.. స్కిప్పింగ్ చేస్తే చేతులు, కాళ్లు, కళ్ళు ఒకేసారి పనిచేయాలి. దీని వల్ల బాడీ బ్యాలెన్స్ బాగా మెరుగుపడుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- రైట్ రోప్.. మీ హైట్‌కు తగ్గ తాడును ఎంచుకోండి. అలాగే మంచి స్పోర్ట్స్ షూస్ వేసుకుంటే గాయాలు కాకుండా ఉంటాయి.
- వార్మప్ మస్ట్.. వ్యాయామం మొదలుపెట్టే ముందు కనీసం 5 నుంచి 10 నిమిషాలు వార్మప్ చేయండి.
- సరైన ప్రదేశం.. కాంక్రీట్, గట్టి నేలపై కాకుండా, చెక్క ఫ్లోర్ లేదా రబ్బరు మ్యాట్‌పై స్కిప్పింగ్ చేయడం వల్ల మోకాళ్లపై ప్రెషర్ తగ్గుతుంది.
- డైట్ ఇంపార్టెంట్.. కేవలం స్కిప్పింగ్ చేస్తేనే సరిపోదు. దానికి సరైన ఆహారం, ఇతర వ్యాయామాలు కూడా తోడైతేనే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి.
స్కిప్పింగ్ అనేది సింపుల్‌గా, తక్కువ ఖర్చుతో చేసే వ్యాయామం. రోజుకు కేవలం 15 నుంచి 20 నిమిషాలు చేస్తే బరువు తగ్గడంతో పాటు.. చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)