మనసున్న మా రాజు..! వాళ్ళకోసం ప్రభాస్ రూ. 50కోట్లు ఇచ్చాడన్న నిర్మాత.. పొంగిపోతున్న అభిమానులు

మనసున్న మా రాజు..! వాళ్ళకోసం ప్రభాస్ రూ. 50కోట్లు ఇచ్చాడన్న నిర్మాత.. పొంగిపోతున్న అభిమానులు


రెబల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. త్వరలోనే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదలకానుంది.ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. అలాగే ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. రాజా సాబ్ తర్వాత వరుస సినిమాలను లైనప్ చేశారు ప్రభాస్.

ఇదిలా ఉంటే ప్రభాస్ గురించి ఓ తమిళ నిర్మాత చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రభాస్ తమకు రూ. 50కోట్లు తిరిగి ఇచ్చేశారు అని తెలిపాడు ఆ నిర్మాత. బాహుబలి సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రభాస్ ఆతర్వాత కొన్ని ఫ్లాప్స్ చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన సాహో , రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా వరుస గా ఫ్లాప్స్ అందుకున్నాడు రెబల్ స్టార్.. దీని గురించే ఆ నిర్మాత మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు ప్రభాస్ రూ. 100కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. అయితే సినిమా నిరాశపరచడంతో రూ. 50కోట్లు తిరిగి ఇచ్చేసి.. నష్టపోయిన డిస్టిబ్యూటర్స్ కు ఇవ్వాలని కోరాడట.. తమిళ్ నిర్మాత చెప్పిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో ఎప్పటిదో క్లారిటీ లేదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా అన్న మనసు బంగారం, మనసున్న మా రాజు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *