ప్రతీ వారం సరదా.. సరదాకే చేపలు వేటకు వెళ్లే వ్యక్తులు చాలామందే ఉంటారు. మన దేశంలో ఈ తంతు తక్కువ గానీ.. విదేశాల్లో చాలా ఎక్కువ. నది ఒడ్డునో.. లేక సరస్సు దగ్గరో.. అలా చేపల గాలం పట్టుకుని వేటకు వెళ్తుంటారు కొందరు. అలా అనుకునే ఓ వ్యక్తి కూడా తనకు దగ్గరలో ఉన్న సరస్సుకు వెళ్లాడు. చేపలు పట్టేందుకు గాలం వేసి.. కొద్ది క్షణాలు వేచి చూశాడు. కట్ చేస్తే.. కాసేపటికే నీటి అడుగున కనిపించిన ఆకారం చూసేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ వివరాలు..
వైరల్ వీడియో ప్రకారం.. స్థానికంగా ఉన్న సరస్సులోకి చేపలు వేటకు వెళ్లిన ఓ వ్యక్తికి అనుకోని షాక్ తగిలింది. చేపల కోసం గాలం నీటిలో వేయగా.. ఆ నీటి అడుగున కనిపించిన ఆకారం చూసేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఓ భారీ మొసలి అతడ్ని అతిధిలా వచ్చి పలకరించింది. అట్టాంటి.. ఇట్టాంటి మొసలి కాదు.. ఏకంగా భారీ కాయంతో అతడు దడుసుకునేలా చేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. కచ్చితంగా మనం ఆస్ట్రేలియా వాటర్స్లోకి వెళ్లకూడదు.. దానికి కారణం ఇదేనంటూ.. వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
The reason you should avoid the water in Australiapic.twitter.com/DYAulFUJ4y
— Cats & Dogs Universe (@CatsandDogsmem) August 2, 2025