ఈ మధ్య సోషల్ మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్, బ్రేయిన్ టీజర్ వంటివి తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నించి విఫలం అవుంటే, కొంత మంది మాత్రం చాలా సులభంగా సమాధానాలను గుర్తిస్తున్నారు. మరి మీకు కూడా ఇలాంటి ఛాలెంజింగ్ గేమ్స్ అంటే ఇష్టమా? మీరు వీటిని పరిష్కరించాలనుకుంటున్నారా?.. అయితే ట్రై చేయండి
పైన కనిపిస్తున్న చిత్రంలో ఓ చెట్టు కనిపిస్తుంది. చెట్టు మొత్తం చాలా పచ్చగా, చెట్టు నిండా ఆకులతో నిండుగా కనిపిస్తుంది. అయితే అందులో ఓ రామ చిలుక దాగి ఉన్నదంట. దానిని మీరు 10 సెకన్స్‌లో కనిపిస్తే మీ మైండ్ చాలా షార్ప్‌గా పని చేయడమే కాకుండా, మీకు మంచి దృష్టినైపుణ్యం ఉన్నట్లు.
మీరు చాలా ఇంటలీజెంట్ అని నిరూపించుకోవాలి అనుకుంటున్నారా? ఈ ఫొటోలో ఉన్న రామచిలకను మీరే త్వరగా గుర్తించగలుగుతారని అనుకుంటున్నారా? అయితే ముందుగా మీరు ఈ చిత్రాన్ని జాగ్రత్తగా , ఏకాగ్రతతో చూడండి, మీరు అందులో దాగి ఉన్న అందమైన రామచిలుకను గుర్తించగలుగుతారు.
ఏమైంది రామ చిలుకను వెతుకుతున్నారా? మీకు ఇప్పటికైనా సమాధానం దొరికిందా? లేదా? ఆన్సర్ దొరకకపోయినా చింతించకండి. ఎందుకంటే? మన ఇప్పుడు పై చిత్రంలో రామచిలుక ఎక్కడ ఉందో గుర్తించుదాం. ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో, చెట్టు మీద, కొమ్మలు, ఆకుల మధ్యలో రామ చిలుక ఉంది. అది చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఆకులు, చిలుక ఒకే రంగులో ఉండటం వలన కొందరికి దీనిని త్వరగా గుర్తించడం కష్టమ అవవచ్చును. మరి ఇప్పటికైనా మీరు రామచిలుకను గుర్తించారు కదా?
ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్స్ ఒక వ్యక్తిలోని ఆలోచన నైపుణ్యాలను మెరుగు పరచడమే కాకుండా, కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి. క్లిష్టమైన పరిష్కారాలను కనుగొడానికి మన మెదడును షార్పు చేస్తుంటాయి. అందుకే చాలా మంది వీటిని పరిష్కరించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఇదే.