POCO తన కొత్త స్మార్ట్‌ఫోన్ POCO M7 ప్లస్‌ను బుధవారం భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ఈ బడ్జెట్ ఫోన్లో పోకో అదిరిపోయే ఫీచర్స్‌ను యాడ్ చేసింది. ఈ ఫోన్లో 7,000mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీ ఉంది. ఇప్పటివరకు వచ్చిన బడ్జెట్ ఫోన్లలో ఇదే అతిపెద్ద బ్యాటరీ అని కంపెనీ చెబుతోంది. ఇందులో ఇంకో ఫీచర్ ఏంటంటే.. దీని బ్యాటరీ నుంచి రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫోన్లో ఇప్పటివరకు పోకో ఫోన్లలో అందుబాటులో లేని FHD+ డిస్ప్లేను పరిచయం చేసినట్టు POCO పేర్కొంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ సెంటర్ పంచ్ హోల్ కటౌట్ పాటు, Qualcomm Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది.
POCO M7 Plus 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే : POCO M7 Plus 5G 6.9-అంగుళాల FHD+ LCD డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. స్క్రీన్ గరిష్టంగా 550 Nits బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది హ్యాండ్సెట్ Qualcomm Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.
స్టోరేజ్: ఈ ఫోన్ 6GB RAM, 8GB RAM వంటి రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB ఫోన్లో 128GB స్టోరేజ్ ఉంటుంది. దీన్ని మైక్రో SD కార్డ్ సహాయంతో 1TB వరకు పెంచుకొవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్ OS పై పనిచేస్తుంది. దీనిలో డ్యూయల్ సిమ్ కార్డు సపోర్ట్ ఉంటుంది.
కెమెరా: ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, సెకండరీ కెమెరాలు ఉంటాయి. 8MP ఫ్రంట్ కెమెరా, గరిష్టంగా 1080p/30fps వీడియో రికార్డింగ్ చేయొచ్చు.
బ్యాటరీ: ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్ 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. పోకో నుంచి వచ్చన బడ్జెట్ ఫోన్లలో ఇదే తొలిసారి. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది, ఇందులో 18W రివర్స్ వైర్డ్ చార్జింగ్ అప్షన్ కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.
ధర: ఇక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఇది రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఒకటి 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ దీని ధర రూ. 13,999. ఇంకోటి 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999.
కలర్స్: ఇక కలర్స్ విషయానికి వస్తే.. POCO M7 Plus 5G ని Chrome Silver, Aqua Blue, Carbon Black రంగులలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్లలో లాంచ్ చేయబడింది.
ఆఫర్స్: ఆగస్టు 19 నుండి మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్‌గా, కంపెనీ HDFC, ICICI బ్యాంక్, SBI కార్డులపై రూ. 1000 తగ్గింపును అందిస్తోంది. లేదా మీరు అదనంగా రూ. 1000 ఎక్స్ఛేంజ్ను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ నో-కాస్ట్ EMIలో కూడా అందుబాటులో ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.