Ravi Shiva Teja: ఈ నటుడు ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అల్లుడని తెలుసా? వీరి లవ్ స్టోరీలో సినిమాలకు మించిన ట్విస్టులు..

Ravi Shiva Teja: ఈ నటుడు ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అల్లుడని తెలుసా? వీరి లవ్ స్టోరీలో సినిమాలకు మించిన ట్విస్టులు..


యాక్టర్‌ రవి శివ తేజ.. యూట్యూబ్‌లో షార్ట్స్‌ ఫిల్మ్స్‌ బాగా చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు 400కు పైగా షార్ట్స్ ఫిల్మ్స్ లో నటించి మెప్పించాడు రవి తేజ. ఇతని కామెడీ పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొట్టిన సూర్య వెబ్ సిరీస్‌లో షణ్ముఖ్‌ జస్వంత్‌ స్నేహుతుడు స్వామి పాత్రలో అదరగొట్టాడీ యాక్టర్. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్నాడు రవి శివ తేజ. ఆ మధ్యన ‘నేను స్టూడెంట్‌ సర్‌’, ‘ఉస్తాద్‌’ సినిమాల్లో మెరిసిన అతనికి సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి పక్కన పెడితే..
రవి శివ తేజ శ్యామల అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జిమ్‌లో పరిచయమైన రవి, శ్యామల మొదట మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమికులుగా మారారు. అయితే శ్యామల టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ డైరెక్టర్ కూతురు కావడంతో తన పెళ్లి జరుగుతుందా? లేదా? అని రవి శివ తేజ భయపడ్డాడు. కానీ శ్యామలనే ధైర్యం చేసి తన ఇంట్లో వాళ్లను ఒప్పించింది. అలా ఇరు కుటుంబ సభ్యుల అనుమతితో పెళ్లిపీటలెక్కారు రవి శివతేజ, శ్యామల. ప్రస్తుతం వీరిద్దరూ హ్యపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఈ నటుడి భార్య ఎవరి కూతురో తెలుసా? గతంలో స్వయంవరం, నువ్వే కావాలి, మన్మథుడు, నువ్వునాకు నచ్చావ్‌, జై చిరంజీవ, మల్లీశ్వరి, ప్రేమ కావాలి వంటి సూపర్ హిట్‌ సినిమాలు తెరకెక్కించిన కే. విజయ్‌ భాస్కర్‌.

కాగా శ్యామలతో ప్రేమ, పెళ్లిపై ఒక ఇంటర్వ్యూలో రవి శివతేజ మాట్లాడుతూ.. ‘ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడేవాడిని. నేను కష్టాల్లో ఉన్నప్పుడు శ్యామల అండగా నిలిచింది. అయితే మా మధ్య ప్రేమ మొదలయ్యే నాటికి ఆమె డైరెక్టర్‌ విజయ భాస్కర్‌ కూతురని కూడా నాకు తెలియదు. అసలు విషయం తెలిశాక మా పెళ్లి జరుగుతుందా లేదా అనే భయం పట్టుకుంది. అయితే ఎన్ని ఇబ్బందులు, సమస్యలు వచ్చినా శ్యామలనే తన కుటుంబ సభ్యలను ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంది’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ విజయ్ భాస్కర్ తో రవి శివతేజ..

కాగా ఇప్పుడు విజయ్ భాస్కర్ పెద్దగా సినిమాలు చేయడం లేదు. రీ ఎంట్రీలో ఆయన చేసిన ప్రేమ కావాలి హిట్ అయినా భలే దొంగలు, మసాలా సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇక తన కుమారుడు శ్రీ కమల్ ను పరిచయం చేస్తూ తెరకెక్కించిన జిలేబి సినిమా కూడా పెద్దగా ఆడలేదు. అలాగే గతేడాది రిలీజైన ఉషా పరిణయం మూవీ కూడా ఆడియెన్స్ మెప్పు పొందలేకపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *