విజయ్ ఆంటోనీ.. నిత్యం ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇటీవల ఆయన నటించిన చిత్రం మార్గన్: ది బ్లాక్ డెవిల్. తెలుగు, తమిళం భాషలలో ఒకేసారి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సేశ్విత కనిమొళి విలన్ గా కనిపించింది.
సేశ్విత కనిమొళి.. తెలుగు సినీప్రియులకు పెద్దగా పరిచయం లేని పేరు. కానీ తమిళంలో మాత్రం పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. మార్గన్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా స్టార్ స్టెటస్ సంపాదించుకుంది. ఇందులో విలన్ పాత్రలో కనిపించింది.
ఈ సినిమాలో సేశ్విత కనిమొళి తన అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. మార్గన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడుకు గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వయ్యారి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
సేశ్విత కనిమొళి సినిమాలో ప్రతినాయికగా అదరగొట్టింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. దీంతో ఇంతందాన్ని విలన్ గా మార్చేశారేంట్రా బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
సేశ్విత కనిమొళి మార్గన్ సినిమా కంటే ముందే తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. అంతుకు ముందు కుట్రమ్ పుదిదు సినిమాలో కనిపించింది. ఇక మార్గన్ సినిమా తర్వాత ఈ బ్యూటీకి తెలుగులోనూ పలు ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.