India vs England: ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అద్భుతంగా ముగిసింది. ఈ టెస్ట్ సిరీస్ ఐదవ, చివరి రోజున, టీమిండియా బలమైన ప్రదర్శన ఇచ్చి ఇంగ్లాండ్‌పై గెలిచింది. దీంతో, ఈ టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌లో, రెండు జట్ల ఆటగాళ్ల ప్రదర్శన బలంగా ఉంది. ఇందులో అనేక రికార్డులను బద్దలు కొట్టారు. ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఐదవ టెస్ట్ మ్యాచ్ మ్యాచ్ చివరి రోజున, చరిత్రలో తొలిసారిగా కనిపించిన రికార్డు నమోదైంది.
వ్యూస్ రికార్డ్ బద్దలు..
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్లో అత్యధికంగా వీక్షించిన టెస్ట్ సిరీస్‌గా మారింది. రెండు జట్ల మధ్య జరిగిన ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్ డిజిటల్ ప్లాట్ఫామ్లో అత్యధికంగా వీక్షించిన టెస్ట్ మ్యాచ్‌గా మారింది. ఐదవ టెస్ట్ మ్యాచ్ చివరి రోజును 1.3 కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం చూశారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత మంది టెస్ట్ మ్యాచ్‌ను ఒక్క రోజు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించలేదు. ఇది మాత్రమే కాదు, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ వీక్షణ సమయం 65 బిలియన్ నిమిషాలు. జియో హాట్‌స్టార్ ఈ టెస్ట్ సిరీస్‌కు డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి, అందులో 17 కోట్లకు పైగా వ్యూస్ పొందింది.
జియో స్టార్ స్పోర్ట్స్ హెడ్ సిద్ధార్థ్ శర్మ మాట్లాడుతూ, భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన చరిత్ర సృష్టించిందని, దీనిపై మేమందరం చాలా సంతోషంగా ఉన్నామని అన్నారు. అందరు ఆటగాళ్లు చాలా బాగా రాణించారు. సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. 17 కోట్లకుపైగా ప్రేక్షకులను చేరుకోవడం, కొత్త రికార్డులు సృష్టించడం నిజంగా సంతోషంగా ఉంది. దీని నుంచి మేం చాలా అనుభవాన్ని కూడా పొందామని తెలిపాడు.
ఇవి కూడా చదవండి
డ్రాగా ముగిసిన సిరీస్..
ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, రెండో టెస్ట్‌లో భారత్ విజయం సాధించింది. లండన్‌లోని లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్ డ్రా కాగా, ఐదో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఐదో టెస్ట్ మ్యాచ్ చివరి రోజున ఇంగ్లాండ్ గెలవడానికి 35 పరుగులు అవసరం. ఆ జట్టు వద్ద నాలుగు వికెట్లు మిగిలి ఉన్నాయి. అయితే, మహ్మద్ సిరాజ్ డేంజరస్ బౌలింగ్‌తో టీం ఇండియాను విజయపథంలో నడిపించాడు. చివరి టెస్ట్ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అతను. మొత్తం 23 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..