ఆసియాలో రెండవ అతిపెద్ద ఇస్కాన్ ఆలయం రెడీ.. ఈ నెల15న ప్రారంభించనున్న PM మోడీ.. ఆలయ విశేషాలు ఏమిటంటే

ఆసియాలో రెండవ అతిపెద్ద ఇస్కాన్ ఆలయం రెడీ.. ఈ నెల15న ప్రారంభించనున్న PM మోడీ.. ఆలయ విశేషాలు ఏమిటంటే


మహారాష్ట్రలో నవీ ముంబైలోని ఖర్ఘర్‌లో నిర్మిస్తున్న ఇస్కాన్ ఆలయ నిర్మాణం సంపూర్ణంగా పూర్తి అయింది. ఈ ఆలయం ఆసియాలోనే రెండో అతి పెద్ద ఇస్కాన్ ఆలయం. ఇది శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ఆలయం. దీనికి శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ ఆలయం అనే పేరు పెట్టారు. ఇది 9 ఎకరాలలో నిర్మాణం జరుపుకుంది. రెండో అతిపెద్ద ఇస్కాన్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

ఈ ఆలయ ప్రారంభోత్సవాలు జనవరి 9 నుంచే ప్రారంభమయ్యాయి.. ఈ ఉత్సవాలు జనవరి 15 న వరకూ జరుగనున్నాయి. ప్రధాని మోదీ ఈ నెల 15న ప్రారంభించనున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ముందు ఒక వారం రోజుల పాటు ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు, యాగం వంటివి నిర్వహిస్తున్నారు. ఆలయ ట్రస్టీ, ప్రధాన వైద్యుడు సూరదాస్ ప్రభు మాట్లాడుతూ ఈ ఆలయాన్ని ప్రారంభించడంతో పాటు సాంస్కృతిక కేంద్రం, వేద మ్యూజియానికి కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ప్రారంభోత్సవానికి ముందు ఈ ఆలయం ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం..

మొదటి ఆలయంగా ప్రభు పాదస్వామి స్మారక చిహ్నం

మహారాష్ట్రలోని నవీ ముంబైలోని ఖర్ఘర్‌లోని సెక్టార్ 23లో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి మొత్తం 12 సంవత్సరాలు పట్టింది. ఈ గొప్ప దేవాలయం తెలుపు, గోధుమ రంగు ఉన్న ప్రత్యేక పాల రాళ్లతో నిర్మించబడింది. ప్రధాని మోడీ గతంలో 2024 అక్టోబర్ 12న ఆలయాన్ని సందర్శించారు. పాలరాతితో నిర్మించిన ఈ ఆలయాన్ని 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. జనవరి 15న ప్రధాని మోడీ ప్రారంభించనున్న ఈ ఆలయంలో శ్రీ కృష్ణుడి జన్మ రహస్యం, శ్రీ కృష్ణుడి లీలలకు సంబంధించిన 3డీ చిత్రాలతో ఆలయ ఆస్థానం అలంకరించబడింది.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో ఈ ఆలయ ప్రధాన ద్వారాలకు ఉన్న తలపులను కిలోల వందల వెండితో తయారు చేశారు. ఈ తలపులపై దశావతార శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అంతేకాదు శంఖు, చక్రం, జెండా వంటి బొమ్మలు బంగారంతో చెక్కబడి ఉన్నాయి. గ్లోరీ ఆఫ్ మహారాష్ట్ర ప్రాజెక్ట్ కింద ఈ ఆలయం నిర్మించబడింది. ఇస్కాన్ ఆలయ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభు పాద స్వామి మూడు విగ్రహాల స్మారక చిహ్నం.. దేశ విదేశాల నుంచి ప్రభు పాద స్వామి అనుచరులు దేశ, విదేశాల నుంచి విగ్రహాలు, ఫోటోలను, పుస్తకాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇస్కాన్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 దేవాలయాలు ఉన్నాయి,. అయితే నవీ ముంబైలోని ఈ ఆలయంలో ఇస్కాన్ వ్యవస్థాపకుడు ప్రభు పాదుడి స్మారక చిహ్నం నిర్మించారు.

ఆలయంలో ఇతర నిర్మాణాలు ఏమిటంటే

  1. దశావతార దేవాలయం ముందు ఒక పెద్ద తోట ఉంది. ఇందులో ఫౌంటైన్లు , చాలా అందమైన లైటింగ్ ఉన్నాయి.
  2. ప్రధాన ఆలయం, దీని పైకప్పులపై ఉన్న కళాఖండాలు తెలుపు, బంగారం, గులాబీ రంగులలో అలంకరించారు.
  3. అంతర్జాతీయ అతిథి గృహం
  4. బోట్ ఫెస్టివల్ కోసం పెద్ద చెరువు
  5. వేద విద్యా కళాశాల లైబ్రరీ
  6. జెయింట్ ప్రసాదం హాలు
  7. ఆయుర్వేద హీలింగ్ సెంటర్, ఇక్కడ ఆయుర్వేదం, యోగాభ్యాసం, మంత్ర సాధన మొదలైనవి నిర్వహించనున్నారు.
  8. స్వచ్ఛమైన శాఖాహార రెస్టారెంట్, ఇక్కడ శ్రీకృష్ణుడికి ఇష్టమైన వంటకాలు వడ్డించనున్నారు.

ఈ ఆలయంలో 3 వేల మంది భక్తులు ఒక్కసారే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా హాజరుకానున్నారు.

సూరదాస్ ప్రభు ఏం చెప్పారంటే

ఈ ఆలయ ధర్మకర్త, ప్రధాన వైద్యుడు సూరదాస్ ప్రభు, నవీ ముంబై ప్రాంతంలో ఈ ఆలయం ఆధ్యాత్మికతకు కొత్త కేంద్రంగా ఆవిర్భవించనుందని చెప్పారు. ప్రధాని రాకతో తనకు మరింత బలం వచ్చిందని..అన్నారు. ఈ ఆలయానికి భగవంతుని పై భక్తీ, ఆశ్రయం పొందేందుకు మాత్రమే భక్తులు వస్తారు. కలత చెందిన మనస్సుకి శాంతి ప్రసాదించమంటూ కృష్ణుడి కోరుకుంటారు. బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ ఆలయంపై జరిగిన పిరికిపంద దాడిని ఖండిస్తున్నట్లు సూరదాస్ మహరాజ్ తెలిపారు. బంగ్లాదేశ్‌కు సంబంధించి భారత ప్రభుత్వ విధానాలను కూడా ఆయన సమర్థించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *