కాంగ్రెస్ పార్టీలోనేకాదు, స్టేట్ పాలిటిక్స్‌ను తన వ్యాఖ్యలతో రచ్చరేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఆయనకు పదవిపై ఇచ్చిన హామీ నిజమేనంటూ.. టీవీ9 క్రాస్ ఫైర్‌లో అసలు విషయాన్ని బయటపెట్టారు. కేబినెట్ కూర్పులో పరిస్థితుల దృష్ట్యా రాజగోపాల్‌రెడ్డికి అవకాశం దక్కలేదంటూ భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే.. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన అనేక అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క TV9 క్రాస్ ఫైర్‌లో మాట్లాడారు.. కక్ష సాధింపు రాజకీయాల ఆరోపణల నుంచి పార్టీ అంతర్గత విషయాల వరకు… కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు.. ఇలా అనేక అంశాలపై టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ సంధించిన ప్రశ్నలకు భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు.