ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించి విదేశీ సంస్థకు ప్రభుత్వ సొమ్మును చెల్లించారన్న ఫిర్యాదుతో.. మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి.. వాదనలు ముగిసిన అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.. అంతేకాకుండా.. క్వాష్ పిటీషన్ పై తీర్పు వచ్చేంత వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.