Hydra: అనుమతులు ఉన్నా.. లేకున్నా వాటి జోలికి వెళ్లం.. హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

Hydra: అనుమతులు ఉన్నా.. లేకున్నా వాటి జోలికి వెళ్లం.. హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు


అనుమతులు ఉన్నా.. లేకున్నా.. నివాస గృహాల జోలికి హైడ్రా వెళ్లదు.. ఇకపై ఆక్రమణలు చేస్తే మాత్రం హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుంది.. అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 8చెరువులు, 12 పార్కులను హైడ్రా కాపాడిందని.. రంగనాథ్ పేర్కొన్నారు. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌పై ప్రజలకు అవగాహన కల్పించామని రంగనాథ్ పేర్కొన్నారు. ఇకపై ఆక్రమణలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. శనివారం మీడియాతో మాట్లాడిన రంగనాథ్.. హైడ్రా ఓవరాల్ ప్రోగ్రెస్‌పై స్పందించారు..

సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్‌జోన్‌లు నిర్ణయిస్తున్నట్లు పేర్కొన్నారు.. ఎన్ఆర్ఎస్‌ఈతో సమన్వయం చేసుకొని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నామన్నారు. అలాగే.. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకు ఉన్న చిత్రాలు సేకరిస్తున్నామని.. వివరించారు.. ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి పారదర్శకంగా, శాస్త్రీయంగా మార్కింగ్ చేయబోతున్నామన్నారు. నాలాలకు సంబంధించి కూడా కిర్లోస్కర్‌తో సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించారు. ఇప్పటివరకు హైడ్రాకు 5800 ఫిర్యాదులు వచ్చినట్లు రంగనాధ్ తెలిపారు. మున్సిపాలిటీల్లో అనధికార నిర్మాణాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.

హైడ్రా చర్యల వల్ల ప్రజల్లో అక్రమ, అనధికార నిర్మాణాలపై అవగాహన పెరిగిందని రంగనాధ్ తెలిపారు. ఎఫ్‌టీఎల్ అంటే ఏంటి?, బఫర్ జోన్ అంటే ఏంటి?, ఎక్కడ నిర్మాణాలు చేసుకుంటే మంచిది.. ఎక్కడ కొనాలి అనే క్లారిటీ.. ప్రజల్లో వచ్చిందని, కొందరు కావాలనే హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *