Andhra: ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేలు చొప్పున జమ.. డబ్బులు రాకపోతే ఇలా చేయండి..

Andhra: ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేలు చొప్పున జమ.. డబ్బులు రాకపోతే ఇలా చేయండి..


రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏ పంట వేస్తే లాభాలు వస్తాయన్నది అధ్యయనం చేసి వారికి సూచనలు జారీ చేస్తామని వెల్లడించారు. సూపర్ సిక్స్ లో ప్రధాన హామీ అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా, దర్శి మండలం, వీరాయపాలెంలో ప్రారంభించారు. పచ్చని పొలాల్లో రైతుల మధ్య కూర్చుని ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. కర్షక సోదరులతో కలిసి పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రైతులతో కాసేపు ముచ్చటించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో గత ప్రభుత్వానికి.. కూటమి ప్రభుత్వానికి గల వ్యత్యాసం ఎంత మేర ఉందో చూడాలని సీఎం అన్నారు. ఎన్నికల్లో చేసిన ప్రకటన మేరకు రైతులకు ఏటా రూ.20,000 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చామన్నారు. ఈ పథకం ద్వారా 3 విడతల్లో రైతులకు ఈ పథకాన్ని వర్తింప చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇలా పచ్చని పొలాలు, దేశానికి అన్నం పెట్టే రైతుల మధ్య ప్రారంభించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు.. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున జమ చేశాం. దీనికోసం రూ.2,343 కోట్ల నిధుల్ని కేటాయించామన్నారు. మొదటి విడతలో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.2,000 చొప్పున రూ.832 కోట్లు ఇస్తోంది. మొదటి విడతలో కేంద్రం-రాష్ట్ర వాటాలు కలిపి ఒక్కో రైతుకు రూ.7,000 జమ చేశామని తెలిపారు. ఈ విడతలో రైతులకు రూ.3,175 కోట్ల మేర లబ్ది కలుగుతోందన్నారు.

పథకం అమలుకు సంబంధించి రైతులకు ఎలాంటి ఫిర్యాదులు, సందేహాలు ఉన్నా అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని ఆర్ఎస్ కే లాగిన్‌ ద్వారా తెలుసుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే 155251 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు.

సూపర్ సిక్స్ అమలు సంతోషాన్నిస్తోంది

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లామని.. ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారని చంద్రబాబు పేర్కొననారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేసింది. చాలా సమస్యలు వచ్చాయి. ఎన్ని కష్టాలున్నా, ఇచ్చినమాట నిలబెట్టుకోవాలని సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని.. ఇది సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు.

15వ తేదీ నుంచి ఉచిత బస్సు

ఆగస్టు 15న స్త్రీ శక్తి కింద ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రంలోని 2 కోట్ల 60 లక్షలమంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

రాజకీయ నేరస్తులతో జాగ్రత్త..

రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్తులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. 47 ఏళ్ల రాజకీయ జీవితంలో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. గతంలో ఎన్నడూ చూడని కొత్త రాజకీయాలు చూస్తున్నానంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ప్రజల కోసం పని చేయాలి. వారి అంతిమ లక్ష్యం అధికారమైనప్పటికీ నైతిక విలువలు, పద్దతులు, నిబంధనలు, కట్టుబాట్లు తప్పనిసరిగా పాటించాలి. జగన్ ను చూసి రప్పా రప్పా, బూతుల పంచాంగం నేర్చుకోవాలా? అంటూ ప్రశ్నించారు. పేదల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు తాను పనిచేస్తున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *