Whatsapp Service: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఒక్క వాట్సప్ మెసేజ్ తో..

Whatsapp Service: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఒక్క వాట్సప్ మెసేజ్ తో..


హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త చెప్పింది. భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై జీహెచ్ఎంసీ యాప్‌తో పాటు వాట్సాప్‌ నగర వాసుల నుంచి ఫిర్యాదులు తీసుకోనుంది. నగర ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్థానికులు వాళ్ల కాలనీల్లోని భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి సమస్యలపై తక్షణమే ఫిర్యాదు చేయగలగే విధంగా ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వెల్లడించారు.

ఇంతకు ముందు మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది. అయితే సమస్యలపై మరింత వేగంగా స్పందించేందుకు ఇప్పుడు వాట్సాప్ నంబర్ 81259 66586 ను ప్రారంభించామని ఆయన తెలిపారు. పౌరులు తమ ప్రాంతంలో ఎదురవుతున్న భవన నిర్మాణ వ్యర్థాలు, గార్బేజ్ బిన్ ఓవర్‌ఫ్లో GVP పాయింట్‌ల వద్ద పేరుకొని పోయిన చెత్త తొలగింపు వంటి సమస్యల ఫోటోలు, లొకేషన్ వివరాలు ఈ నంబర్‌కు పంపించవచ్చు.

ఇలా వచ్చిన ఫిర్యాదులను అధికారులు ప తక్షణమే పరిష్కారం చూపుతారని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రజల సహకారంతో పరిశుభ్ర నగర లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఆర్ వి కర్ణన్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *