Chethabadi: వణికిస్తున్న చేతబడి మోషన్ పోస్టర్‌.. ఏంట్రా బాబోయ్ ఇలా ఉంది

Chethabadi: వణికిస్తున్న చేతబడి మోషన్ పోస్టర్‌.. ఏంట్రా బాబోయ్ ఇలా ఉంది


చిన్న మోషన్ పోస్టరే.. ఇప్పుడీ సినిమాపై టెర్రెఫిక్ ఎక్స్‌ప్రెషన్స్‌ను పెంచేస్తోంది. అందరికీ తెలియని థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు.. సినిమా గురించి అందరూ ఆరా తీసేలా చేస్తోంది. శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్ పై నంద కిషోర్ నిర్మాణంలో నూతన దర్శకుడు సూర్యాస్ రూపొందిస్తున్న చిత్రం ‘చేతబడి’. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సూర్యాస్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కోడి తళతో… రక్తంతో ఉన్న ఈ మోషన్ పోస్టర్ చూసిన వారందరికీ థ్రిల్లింగ్ ఫీలింగ్‌నిస్తోంది. చేతబడి మోషన్ పోస్టర్ రీలీజ్ చేస్తూ డైరెక్టర్ సూర్యాస్ ఈ సినిమా గురించి మాట్లాడారు. చేతబడి అనేది 16 వ శతాబ్దంలో మన ఇండియాలో పుట్టిన ఒక కల అని.. రెండు దేశాలు కొట్టుకోవాలన్న రెండు దేశాలు కలవాలన్నా.. ఒక బలం బలగంతో ఉండాలి. కానీ ఒక ఈవిల్ ఎనర్జీతో మనిషిని కలవకుండా అతన్ని చంపే విద్యే చేతబడి అని వివరించాడు. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారని.. తన సినిమాలో చాలా విభిన్నంగా చూపించబోతున్నా అంటూ చెప్పాడు. మన బాడీలో ప్రతిదానికి ఒక ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ఒక ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఆధారపడి ఉంటుందన్నాడు డైరెక్టర్ సూర్యాస్‌. 1953 గిరిడ అనే గ్రామంలో రియల్ గా జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను సిద్ధం చేశానని.. ఆయన చెప్పాడు. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా థిక్ గా ఉంటాయి. వర్షం పడినా అవి నెలలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇందులో చూపించబోతున్నాం అంటూ చేతబడి స్టోరీ గురించి వివరించాడు డైరెక్టర్ సూర్యాస్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బొజ్జ నొప్పితో బోరుమంటూ ఏడుస్తూ ఆస్పత్రికెళ్లిన మహిళ.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్‌

పైసా జీతం లేకుండా 32 ఏళ్లుగా ట్రాఫిక్‌ డ్యూటీ.. అతని జీవితంలో ఆ విషాదం..?

రోజూ 8 గంటలు కదలకుండా కూర్చుంటున్నారా ?? అయితే ఈ వ్యాధులు మీకు దగ్గరపడుతున్నట్లే

నీటిని మరిగిస్తే బ్యాక్టీరియా చనిపోతుందా..? అధ్యయనంలో ఆశ్చర్యపోయే నిజాలు

కరోనా బాధితులకు ముందుగానే ముసలితనం.. సంచలనం రేపుతున్న లేటెస్ట్‌ అధ్యయనం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *