
ఒడిశాలోని గజపతి జిల్లాలో ఒక ప్యూన్ చేసిన అసహ్యకరమైన చర్య.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య విభాగం (RWSS)లో పనిచేస్తున్న ఒక ఇంజనీర్ ప్యూన్‌ను తాగడానికి నీరు అడిగారు.. దీంతో ఆ ప్యూన్ అతనితో నీటికి బదులుగా మూత్రం తాగించాడని పేర్కొంటున్నారు. దీని కారణంగా అతని ఆరోగ్యం క్షీణించింది. మూత్రం తాగించాడని.. ప్యూన్ పై సంచలన ఆరోపణలు చేసిన ఇంజనీర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదే సమయంలో, ప్యూన్ తాను ఇంజనీర్‌కు శుభ్రమైన నీటిని ఇచ్చానని చెబుతున్నాడు. ప్రస్తుతం, ఆ నీరు/మూత్రం నమూనాను పరీక్ష కోసం పంపారు. నివేదిక అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటనపై ఇంజనీర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన జూలై 23న జరిగినట్లు చెబుతున్నారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య విభాగం (RWSS) ఇంజనీర్ సచిన్ గౌడ FIR దరఖాస్తులో ఇలా రాశారు. నేను జూలై 22న కార్యాలయంలో జూనియర్ ఇంజనీర్‌గా చేరాను. జూలై 23న రాత్రి భోజనం చేసిన తర్వాత, ప్యూన్ శిబా నారాయణ్ నాయక్ నుంచి నీరు అడిగాను. తాగే నీళ్ళు అని చెప్పి ఆ ప్యూన్ తనకు స్టీల్ బాటిల్ ఇచ్చాడని సచిన్ గౌడ వివరించారు.
తరువాత అందులో మూత్రం ఉందని అనుమానం వచ్చింది. మరో ఇద్దరు ఉద్యోగులు కూడా అదే బాటిల్ నుండి నీరు తాగారు.. వారు కూడా నీటి నుండి వచ్చే వాసన గురించి ఫిర్యాదు చేశారు. నీటి రుచి కూడా పూర్తిగా భిన్నంగా ఉంది. అది చాలా దుర్వాసన వచ్చింది. కాబట్టి వారు మిగిలిన నీటిని/మూత్రాన్ని దాచిపెట్టారు. మరుసటి రోజు అనారోగ్యానికి గురైన తర్వాత ఇంజనీర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ప్రయోగశాలకు నమూనా
అతను మొత్తం సంఘటనను పోలీసులకు చెప్పాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత, బాటిల్‌లో మిగిలిపోయిన నీటి నమూనాను స్థానిక ప్రయోగశాలకు పంపారు. రెండవ నమూనాను పర్లాఖేముండిలోని ప్రయోగశాలకు తుది పరీక్ష కోసం పంపారు. ఈ సంఘటన తర్వాత అనారోగ్యానికి గురైన ఇంజనీర్ గౌడ చికిత్స పొందుతున్నాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ ఉదయగిరి పోలీస్ స్టేషన్‌లో దాఖలైన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఒడిశా జల వనరుల డైరెక్టరేట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ముందు కూడా లేవనెత్తారు.
ప్యూన్ ఏం చెప్పాడంటే..
అదే సమయంలో, ప్యూన్ తాను నీరు ఇచ్చానని, దానిని ఏ విధంగానూ కల్తీ చేయలేదని చెబుతున్నాడు. ఇంజనీర్ తనపై ఎందుకు ఇలా ఆరోపిస్తున్నారో తెలియదంటూ పేర్కొన్నాడు.. గురువారం రాత్రి విచారణ తర్వాత పోలీసులు ప్యూన్‌ను విడుదల చేశారు. శుక్రవారం ఉదయం మళ్ళీ పోలీసులు నిందితుడైన ప్యూన్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అరెస్టు చేశారు. నీరు/మూత్ర నమూనా నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..