మన శరీరానికి కొల్లాజెన్ అనేది చాలా ముఖ్యమైన ప్రోటీన్. ఇది చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే ఎముకలు, కండరాలు, జుట్టు, గుండె, పేగుల ఆరోగ్యానికి కూడా కొల్లాజెన్ అవసరం. అయితే వయసు పెరిగే కొద్దీ దీని ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి సహజ పద్ధతుల్లో కొల్లాజెన్ ను పెంచడం మంచిది. దీని కోసం నారింజ, పసుపు రసం చాలా ఉపయోగపడుతుంది.
ఎందుకు మంచిది..?
నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి చాలా అవసరం. ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచి.. ముడతలు రాకుండా చేస్తుంది.
పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థం శరీరంలోని వాపును తగ్గిస్తుంది. దెబ్బల్ని త్వరగా మానేందుకు సహాయపడుతుంది.
ఈ రెండింటి కలయికతో తయారైన ఈ డ్రింక్ ఒక సహజసిద్ధమైన ఆరోగ్య రక్షక కవచంలా పనిచేస్తుంది.
తయారీ విధానం
- 2 లేదా 3 బాగా పండిన నారింజలు తీసుకుని వాటి రసం తీయాలి.
- ఆ రసంలో చిటికెడు ఆర్గానిక్ పసుపు పొడి కలపాలి.
- రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.
- చల్లగా తాగాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.
- ఈ డ్రింక్ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ డ్రింక్ చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా.. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో బలహీనత తగ్గి ఉత్సాహంగా ఉంటారు.
మీకు ఏదైనా అలెర్జీలు ఉన్నా, గర్భిణీ స్త్రీలు అయినా, లేదా ఏదైనా వైద్య చికిత్స తీసుకుంటున్నా.. ఈ డ్రింక్ తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఈ నారింజ, పసుపు డ్రింక్ మన ఇంట్లోనే దొరికే సహజ పదార్థాలతో తయారవుతుంది. చర్మం కాంతివంతంగా, శరీరం బలంగా ఉండాలంటే ఈ డ్రింక్ ని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)