శరీర బరువును తగ్గించాలనుకుంటే ముందుగా జీవనశైలిలో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఎక్కువ కేలరీలు, ఎక్కువ కొవ్వులు, ఎక్కువ చక్కెరలు ఉండే ఆహారాలను తగ్గించాలి. సమతుల్యమైన, తక్కువ కేలరీలు ఉండే భోజనం అలవాటు చేసుకోవడం ముఖ్యం. దీనితో పాటు రోజూ వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ పద్ధతిలో సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన డ్రింక్స్ లను ఉదయాన్నే తాగితే బరువు తగ్గే పని వేగంగా అవుతుంది.
నిమ్మ నీరు
రోజును ప్రారంభించడానికి నిమ్మ నీరు ఒక బెస్ట్ ఆప్షన్. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే.. అది శరీరంలోని అనవసర కొవ్వును కరిగిస్తుంది. అంతేకాదు శరీరాన్ని డిటాక్స్ చేసి శుభ్రం చేయడంలో కూడా సహాయపడుతుంది.
బ్లాక్ కాఫీ
బ్లాక్ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ మోతాదులో తీసుకుంటే.. ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎనర్జీ వస్తుంది. అలాగే శరీర జీవక్రియల వేగాన్ని కూడా పెంచుతుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను మరింత మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.
మెంతి నీరు
మెంతి నీరు బొజ్జ తగ్గడానికి ఒక పురాతన చిట్కా. రాత్రి కొద్దిగా మెంతులు నీటిలో నానబెట్టండి. ఉదయం ఆ నీటిని వడగట్టి తాగితే ఆకలి అదుపులో ఉంటుంది. మెంతుల్లో పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
పొట్ట కొవ్వును తగ్గించాలనుకునే వారికి ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా బాగా సహాయపడుతుంది. తక్కువ మోతాదులో ఈ వెనిగర్‌ను గోరువెచ్చటి నీటిలో కలిపి తాగితే శరీరంలోని కొవ్వును కరిగించడంలో తోడ్పడుతుంది. అయితే దీన్ని మరీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
అల్లం టీ
అల్లంలో ఉండే జింజెరాల్ అనే పదార్థం కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది. ఇది శరీరం జీవక్రియల వేగాన్ని పెంచి ఎక్కువ కేలరీలను ఖర్చు చేసేలా చేస్తుంది. ఉదయం ఈ టీ తాగడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
పసుపు నీరు
అల్లం, పసుపు కలిపి చేసిన నీరు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లతో నిండి ఉంటుంది. ఇది శరీరాన్ని శుభ్రం చేయడంలో కొవ్వును కరిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజూ తాగితే మంచి ఆరోగ్యం లభిస్తుంది.
ఈ డ్రింక్స్ సహజమైనవి అయినా.. ప్రతి వ్యక్తి శరీరానికి సరిపడకపోవచ్చు. కాబట్టి మీ ఆహారంలో ఎలాంటి మార్పులు అయినా చేసే ముందు తప్పకుండా పోషకాహార నిపుణులు లేదా డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)