ఇది హైపర్బోలిక్ ఆకారంలో ప్రయాణిస్తుందని, సూర్యుని చుట్టూ మూసిన కక్ష్యలో తిరగదని నాసా వివరించింది. అంటే, ఇది కేవలం మన సౌర వ్యవస్థ గుండా వెళుతోందని, ఆపై అంతరిక్షంలోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని తెలిపింది. హార్వర్డ్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ అవీ లోయెబ్ మాట్లాడుతూ, ఈ వస్తువును గ్రహాంతర నాగరికత పంపి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. 3I/ATLAS సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య భూమికి కేవలం 5 డిగ్రీల దూరంలో ఉండటం యాదృచ్ఛికంగా జరిగే అవకాశం చాలా తక్కువని, కేవలం 0.2 శాతం మాత్రమే ఛాన్స్ ఉందని ఆయన అన్నారు. సుమారు 20 కిలోమీటర్ల వ్యాసంతో ఇది చాలా పెద్దగా ఉందని, అయితే దీనిలో తోకచుక్క లక్షణాలు లేవని లోయెబ్ తెలిపారు. ఏలియన్ టెక్నాలజీ ఊహించినట్లుగా ఇది సౌర వ్యవస్థ లోపలి భాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చు అని ఆయన పేర్కొన్నారు. అయితే, లోయెబ్ వాదనలపై ఇతర శాస్త్రవేత్తలు అంతగా ఏకీభవించడం లేదు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లో ప్లానెటరీ డిఫెన్స్ హెడ్ రిచర్డ్ మోయిస్ల్ మాట్లాడుతూ, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 3I/ATLAS కు సహజం కాని మూలాలను సూచించే ఎలాంటి సంకేతాలు లేవని తెలిపారు. ఈ వస్తువును చిలీలోని ATLAS టెలిస్కోప్ జూలై 1న కనుగొంది. దీని కూర్పు, నిర్మాణం, మూలం గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు హబుల్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌లను ఉపయోగించి అధ్యయనం చేస్తున్నారు. ఇది ఈ ఏడాది అక్టోబర్ 29న సూర్యునికి దగ్గరగా చేరుకుంటుందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ ట్యాలెంటో.. కారును అక్కడెలా పార్క్ చేశావ్ సామీ
బీమా సొమ్ము కోసం.. కాళ్లు కట్ చేయించుకున్న డాక్టర్
చౌడేశ్వరి ఆలయంలో అర్థరాత్రి వేళ వెలుతురు.. వెళ్లి చూస్తే షాక్
అయ్యో.. చిట్టి చింపాంజీ చేసిన పనికి తల పట్టుకున్న తల్లి
Andhra Pradesh: కాబోయే తల్లులకు సూపర్ గుడ్‌న్యూస్..!