Karthi: కార్తీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వారికి స్వయంగా విందు భోజనాలు వడ్డించిన హీరో.. వీడియో ఇదిగో

Karthi: కార్తీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వారికి స్వయంగా విందు భోజనాలు వడ్డించిన హీరో.. వీడియో ఇదిగో


కోలీవుడ్‌ స్టార్‌ హీరో కార్తీ ఇప్పుడు సినిమా షూటింగులతో బిజీగా ఉంటున్నాడు. ఇటీవలే నాని హీరోగా వచ్చిన ‘హిట్‌‌‌‌ 3’చిత్రం క్లైమాక్స్‌‌‌‌లో కనిపించి సర్‌‌ప్రైజ్ చేశాడు కార్తి. ఏసీపీ వీరప్పన్‌‌‌‌ పాత్రలో కొద్ది సేపు కనిపించినా బాగా హైలెట్ అయ్యాడు. ‘హిట్‌‌‌‌’ఫ్రాంచైజీలో రాబోయే నాలుగు భాగంలో కార్తీనే హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు కార్తీ పలు సీక్వెల్స్ లో నటిస్తున్నాడు. ఖైదీ 2తో పాటు సర్దార్ 2 సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇందులో మొదటగా సర్దార్ 2 రిలీజ్ కానుంది. ఈ సినిమాకు పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణన్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. గతంలో కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సర్దార్‌ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్‌ కాగా సినీ అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్‌ వచ్చింది. ఇక ఇటీవలే సర్దార్-2 ‍సినిమా షూటింగ్‌ కూడా పూర్తి అయ్యింది. దీంతో చిత్ర బృందం సభ్యులందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేసింది.. ఈ కార్యక్రమంలో హీరో కార్తీ స్వయంగా అందరికీ భోజనాలు వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు కార్తీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా సర్దార్ 2 సినిమాలోనూ కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే ఎస్‌జే సూర్య, మాళవికమోహన్‌, ఆషికా రంగనాథ్‌, రజిషా విజయన్‌, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్‌ సీఎస్‌ ఈ క్రేజీ సీక్వెల్ కు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. దీంతో పాటు గతంలో కార్తీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించిన ‘ఖాకీ’చిత్రానికి కూడా సీక్వెల్‌‌‌‌ తెరకెక్కబోతోంది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు వినోదే సీక్వెల్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

వీడియో ఇదిగో..<

/h3>
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *