మొదటిది.. బయటి వాతావరణం వేడిగా ఉంటే.. ఇంటిని చల్లబరిచేది. వేసవిలో మనం ఇదే వాడుతుంటాం. రెండవది గది వాతావరణాన్ని పొడిగా మార్చేది. అంటే డ్రై మోడ్ అన్నమాట. మూడవది.. ఫ్యాన్ మోడ్. ఈ చల్లని వాతావరణంలో మీ ఏసీని డ్రైమోడ్ లో పెడితే.. గదిలో తేమ తగ్గి.. పొడి వాతావరణం నెలకొంటుంది. వేసవిలో మనం చల్లని గాలి కోసం ఏసీని ఆన్ చేసినప్పుడు.. ఏసీలోని కంప్రెషర్ ఆన్ అవుతుంది. దీనివల్ల, ఎక్కువ కరెంటు వినియోగం జరిగి.. ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది. కానీ, ఏసీని డ్రై మోడ్‌లో నడపటానికి తక్కువ కరెంటే చాలు. దీనివల్ల విద్యుత్ బిల్లు కూడా పెద్దగా రాదు. వర్షాకాలంలో చల్లని వాతావరణం వల్ల అలెర్జీలు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే..డ్రై మోడ్ వల్ల గదిలోని తేమ తగ్గి ఈ సమస్యలను కొంతవరకు అదుపులో పెట్టొచ్చు. అలాగే.. ఇంటిలోని అధిక తేమ వల్ల గోడలు, పైకప్పులపై బూజు పెరుగుతుంది. డ్రై మోడ్ వాడితే.. ఇది తొలగిపోతుంది. వానాకాలంలో గదిలో డ్రై మోడ్ పెట్టి.. సగం ఆరిన బట్టలను ఆరవేస్తే అవి త్వరగా ఆరతాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీర్య నిరోధక మాత్ర పనిచేస్తుంది
మీ గుట్టురట్టు చేసే wifi వచ్చిందోచ్..!
అదృష్టం అంటే ఇదే.. కూలీకి దొరికిన ‘8 వజ్రాలు’
సౌరవ్యవస్థలో అరుదైన వస్తువు.. ఏలియన్స్‌కు చెందినదా
ఓర్నీ ట్యాలెంటో.. కారును అక్కడెలా పార్క్ చేశావ్ సామీ