డుంబ్రిగూడ మండలం కించమండ పరిధి గ్రామాల్లో డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. కొండలు మారుమూల ప్రాంతాల్లో నిఘా పెంచారు పోలీసులు. సుమారు 10 గ్రామాల పరిసర ప్రాంతాల్లో సర్వే చేశారు. గతంలో జి మడుగుల మండలం డేగలరాయిలో గంజాయి సాగు చేస్తున్న తోటలను పోలీసులు గుర్తించారు. రెవెన్యూ ఫారెస్ట్ అధికారుల సహకారంతో ఆ మొత్తాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. పాడేరు, జి మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో అధునాతమైన డ్రోన్లు సహాయంతో నిఘాపెంచారు. నాలుగు ప్రత్యేక డ్రోన్లతో అదేపనిగా అడవిని జల్లెడ పడుతున్నారు. గంజాయిని ధ్వంసం చేయడమే కాదు.. వాటికి దూరంగా ఉండాలని పదేపదే చెబుతున్నారు. మళ్ళీ మళ్ళీ సాగు చేస్తున్న వారిని గతంలో అరెస్ట్ లు కూడా చేశారు. స్వయంగా ఎస్పీ స్థాయి అధికారి ఈ గంజాయి వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక డ్రోన్ల గురించి ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారిని రంగంలోకి దించారు. ప్రస్తుతం నాలుగు అధునాతన డ్రోన్లను వినియోగిస్తున్నారు. పోలీసుల ఆపరేషన్‌తో మరి కొంతమంది స్వచ్ఛందంగా గంజాయి తోటలను తొలగిస్తున్నారు. జి.మాడుగుల పరిసర ప్రాంతాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఏపీ సర్కార్ డ్రోన్ల టెక్నాలజీ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కీలక కార్యకలాపాల కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. గవర్నమెంట్ డైరెక్షన్స్ తో ఏజెన్సీ నుంచి సమూలంగా గంజాయిని తొలగించే పనికి డ్రోన్లతో శ్రీకారం చుట్టారు పోలీసులు. గంజాయి సాగే కాదు.. గుట్టుగా గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్ల పైన డ్రోన్లతో నిఘా పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వర్షాకాలంలో ఏసీని ఇలా వాడితే.. పొడిగా మారే ఇల్లు..
వీర్య నిరోధక మాత్ర పనిచేస్తుంది
మీ గుట్టురట్టు చేసే wifi వచ్చిందోచ్..!
అదృష్టం అంటే ఇదే.. కూలీకి దొరికిన ‘8 వజ్రాలు’
సౌరవ్యవస్థలో అరుదైన వస్తువు.. ఏలియన్స్‌కు చెందినదా