టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కింగ్డమ్ . జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ గురువారం (జులై 31) న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలన్నీ కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ల నటనపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి టేకింగ్ కూడా సూపర్బ్ గా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా రౌడీ బాయ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడని అతని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద కింగ్ డమ్ సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కింగ్ డమ్ చిత్ర బృందం కూడా ఆనందంలో మునిగి తేలుతోంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో సంబరాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీమ్ కేక్ కట్ చేసి.. టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకుంది. సత్యదేవ్, నటుడు వెంకటేష్ తో పాటు నిర్మాత నాగవంశీ తదితర చిత్ర బృందం సభ్యులు ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం కింగ్ డమ్ సెలబ్రేషన్స్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ కింగ్ డమ్ సినిమాను నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ తో పాటు మలయాళ నటుడు వెకంటేష్ మరో కీలక పాత్రలో మెరిశారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి స్వరాలు అందించాడు.
సంబరాల్లో కింగ్ డమ్ చిత్ర బృందం..
Blockbuster energy 🔥🔥
Team #Kingdom celebrates the thunderous response! 🥳🤩Here’s to the massive love from the audience 🙌🔥 #BoxOfficeBlockbusterKingdom @TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse @Venkitesh_VP @dopjomon #GirishGangadharan… pic.twitter.com/Ey2Qiphmx7
— BA Raju’s Team (@baraju_SuperHit) July 31, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి