జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడిని న్యాయ దేవుడు అని పిలుస్తారు. వ్యక్తి చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. శనీశ్వరుడు నెమ్మదిగా కదిలే గ్రహం. ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. మొత్తం రాశిచక్ర చక్రాన్ని పూర్తి చేయడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఈ సమయంలో శనీశ్వరుడు మూడు రాశుల్లో వెండి పాదంతో నడుస్తున్నాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం శని వెండి పాదాలతో ఒక రాశిలో సంచరించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో పురోగతి మొదలవుతుంది. సుఖ సంతోషాలు, సిరి సంపదలు లభిస్తాయి. ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు బలమైన స్థితిలో ఉంటే.. ఈ సమయం కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తుంది. ఈ రోజు శనీశ్వరుడు వెండి పాదాల నడకతో రానున్న రెండు సంవత్సరాలు మూడు రాశులకు శుభాలు కలగానున్నాయి.
కర్కాటక రాశి: శనీశ్వరుడి సంచారము కర్కాటక రాశి వారికి ఒక వరం లాంటిది. కొంతకాలంగా వీరిని పట్టిపీడిస్తున్న సమస్యల నుంచి నెమ్మదిగా బయటపడతారు. పని తీరు మెరుగుపడుతుంది. ఆటంకాలతో ఆగిపోయిన పాత పని మళ్ళీ ఊపందుకుంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. ప్రేమ జీవితం కూడా సమతుల్యంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా సుఖ సంతోషాలతో సాగుతుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా లాభదాయక స్థితిలో ఉంటారు. మొత్తంమీద ఈ రాశికి చెందిన వారు శనిశ్వరుడి అనుగ్రహంతో 2027 వరకు ఉన్నత స్థితిలో ఉంటారు.
వృశ్చిక రాశి: శనీశ్వరుడి ప్రస్తుతం వృశ్చిక రాశిలో తన వెండి పాదాలతో నడుస్తున్నాడు. వీరి జాతకంలో శనీశ్వరుడు శుభ స్థితిలో ఉండడం వలన రాబోయే సమయం ఈ రాశికి చెందిన వ్యక్తులు గొప్ప ఎత్తులకు వెళ్తారు. వ్యాపారంలో ఉన్నవారు భారీ ప్రయోజనాలను పొందనున్నారు. ఏదైనా పాత పెట్టుబడి నుంచి భారీ లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పదోన్నతి లేదా జీతం పెంపుదల పొందే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ లేదా ఇతర ఆర్థిక వనరుల నుంచి లాభాలను పొందవచ్చు. వీరు ఏ పని చేపట్టినా.. ఆ పనిలో విజయం సాధించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
కుంభ రాశి: ఈ సమయం కుంభ రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. శనీశ్వరుడి వెండి పాదాలు వీరికి అనేక కొత్త అవకాశాలను తెస్తాయి. కెరీర్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇది వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు వీరు దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగాలు కోసం చూస్తున్న వ్యక్తులు కొత్త ఆఫర్లను పొందే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగాలలో ఉన్నవారు కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్లను పొందవచ్చు. మొత్తంమీద ఈ రాశికి చెందిన వ్యక్తులు కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితాలు పొందే సమయం ఇది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.