జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు నవ గ్రహాల్లో ఒక గ్రహం. రాహు స్థానం క్షీణిస్తే ఆ వ్యక్తి జీవితాంతం సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. రాహువు ప్రతికూలంగా ఉండటానికి కారణం.. చేసే కర్మలతో పాటు ఇంటి వాస్తుకు సంబంధించిన కొన్ని లోపాలు. కొంత మంది ప్రజలు తెలిసి లేదా తెలియక వాస్తుకు సంబంధించిన తప్పులు చేస్తారు. దీని కారణంగా జాతకంలో రాహువు స్థానం చెడుగా మారుతుంది. ఈ రోజు ఇంట్లో చేసే తప్పులు ఏమిటో తెలుసుకుందాం..
మంచం మీద తినడం
వాస్తు శాస్త్రం ప్రకారం మంచం మీద కూర్చుని ఆహారం తినడం అశుభమని భావిస్తారు. దీని వల్ల రాహువు ప్రతికూల ప్రభావాలను చూపడం ప్రారంభిస్తాడని నమ్ముతారు. మంచం మీద కూర్చుని ఆహారం తినే ఇంట్లో ప్రజలు ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. కనుక మంచం మీద కూర్చుని ఆహారం తినవద్దు. నేలపై కూర్చుని ఆహారం తినడం వలన జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి.
నైరుతి దిశ లోపం
వాస్తు శాస్త్రంలో నైరుతి దిశ రాహువుకు సంబంధించినది. అటువంటి పరిస్థితిలో ఇంటి ప్రధాన ద్వారం, తలుపులు నైరుతి దిశలో ఉండకూడదు. లేకుంటే జీవితంలో రాహువు ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. అలాగే నైరుతి మూలలో ఎప్పుడూ టాయిలెట్ లేదా బాత్రూమ్ నిర్మించకూడదు. ఈ దిశలో వీటి నిర్మాణం రాహువు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని.. జీవితంలోని ఆనందం, శాంతిలోపిస్తుందని నమ్ముతారు.
ఇవి కూడా చదవండి
ఇంట్లో ముళ్ళ మొక్కలు పెంచితే
ఇంట్లో ముళ్ళ మొక్కలను ఎప్పుడూ పెంచుకోరాదు. ఈ మొక్కల వల్ల రాహువు ప్రభావం పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉండటం కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది . కెరీర్‌లో కూడా సమస్యలను కలిగిస్తుంది. కనుక ముళ్ళ మొక్కలను ఇంటి బయట బహిరంగ ప్రదేశంలో పెంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ముళ్ళ మొక్కలను ఇంటి లోపల పెంచుకోలేదు.
ఇంటి చెత్త పోగువుతూ ఉంటే
ఇంట్లో చెత్త ఎంత ఎక్కువగా ఉన్నా లేదా ఇల్లు అంతా అస్తవ్యస్తంగా ఉంటే రాహువు దుష్ప్రభావాలను ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ఎవరైనా సరే పొరపాటున కూడా ఇంట్లో చెత్త లేదా అనవసరమైన వస్తువులను పోగు చేసి ఉంచకూడదు. ముఖ్యంగా ఇంటి పూజా స్థలం, వంటగది, పడకగదిలో ధూళి, చెత్త పేరుకుపోకుండా శుభ్రంగా పెట్టుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.