ఛీ.. ఛీ.. నీచుడా.. హాస్పిటల్‌ బాత్రూంలో సిక్రెట్ కెమెరా.. 13 వేల మంది మహిళల వీడియోలు చిత్రీకరించి..

ఛీ.. ఛీ.. నీచుడా.. హాస్పిటల్‌ బాత్రూంలో సిక్రెట్ కెమెరా.. 13 వేల మంది మహిళల వీడియోలు చిత్రీకరించి..


అమెరికాలో మన ఇండియన్‌ ఒకడు తలదించుకునే పనిచేశాడు. సీక్రెట్‌ కెమెరాలు పెట్టి వేల వీడియోలతో దొరికిపోయాడు. అతనికి కఠిన శిక్షకోసం ఆధారాలు సేకరిస్తోంది అక్కడి ప్రాసిక్యూషన్‌.. లాంగ్ ఐలాండ్‌లోని స్లీప్ సెంటర్‌లో స్లీప్‌ టెక్‌గా పనిచేసే సమయంలో సంజయ్‌ శ్యామ్‌ప్రసాద్.. బాత్రూమ్‌లలో స్మోక్‌ డిటెక్టర్లతో స్పై కెమెరాలు అమర్చి పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా వీడియోలను చిత్రీకరించాడు.. నార్త్‌వెల్ స్లీప్ డిజార్డర్స్ సెంటర్‌లోని బాత్రూమ్‌లలో సహోద్యోగులు, చిన్న పిల్లలు సహా పేషెంట్లెవరినీ వదలకుండా రహస్యంగా వీడియోలు తీసేవాడు 47ఏళ్ల సంజయ్ శ్యామ్‌ప్రసాద్‌.. 2022 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య వేల వీడియోలు తీసినట్లు గుర్తించారు.

తొమ్మిది బాత్రూమ్‌ల చుట్టూ స్మోక్‌ డిటెక్టర్‌లా కనిపించే స్పై కెమెరాలను నిందితుడు అమర్చినట్లు గుర్తించారు. షిఫ్ట్ అయిపోయాక ఫేక్ స్మోక్ డిటెక్టర్‌ని తొలగించి, వీడియో ఫైల్స్‌ని SD కార్డులో భద్రపరుచుకుని తన వర్క్ కంప్యూటర్‌లో చూసేవాడు. 2024 ఏప్రిల్‌లో సంజయ్ తన ఫోన్‌లో బాత్రూమ్ ఫుటేజ్ చూస్తుండగా సహోద్యోగి ఒకరు గుర్తించారు. వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు అప్పగించారు. సుమారు 13,332 మంది రోగులు , సిబ్బంది వీడియోలను చిత్రీకరించినట్లు గుర్తించారు. 300కు పైగా వీడియోలను ప్రాసిక్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు.

చాలా వీడియోలను స్వాధీనం చేసుకున్న ప్రాసిక్యూటర్లు.. 2024 ఏప్రిల్ 23దాకా ఆస్పత్రిని సందర్శించిన వారికి లేఖలు పంపించారు. వారి నుంచి వివరాలను సేకరించనున్నారు. కఠిన శిక్ష విధించేలా బాధితులను యంత్రాంగం సమీకరిస్తోంది.. వీడియోలను సమీక్షిస్తున్న నాస్సావ్ కౌంటీ DA కార్యాలయం .. నేరం ధృవీకరణ కావటంతో కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. శ్యామ్ ప్రసాద్ నేరాన్ని ఒప్పుకోవడంతో.. ఐదు సంవత్సరాల ప్రొబెషన్‌ శిక్ష పడుతుందని పేర్కొంటున్నారు అక్కడి అధికారులు.. మొత్తంగా.. శ్యాంప్రసాద్‌ నిర్వాకంతో అగ్రరాజ్యంలోని భారతీయులు తలదించుకోవాల్సి వచ్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *