Telangana: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ – సస్పెన్స్ ఎందుకో తెలుసా?

Telangana: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ – సస్పెన్స్ ఎందుకో తెలుసా?


తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీ వర్గాల కోసం పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఈ దిశగా పంచాయతీరాజ్ చట్టం, 2018కి సవరణలు చేయాలని నిర్ణయించి, తగిన ఆర్డినెన్సు ముసాయిదాను సిద్ధం చేసింది. జులై 11న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుని, ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదానికి జులై 15న పంపించారు. అయితే గవర్నర్ జిష్ణదేవ్ పర్మ ఆ ఫైల్‌ను సమగ్రంగా పరిశీలించి, తనంతట తానే నిర్ణయం తీసుకోకుండా ఢిల్లీలోని అటార్నీ జనరల్‌కు న్యాయసలహా కోసం పంపించినట్టు సమాచారం.

న్యాయసలహాపై ఉత్కంఠ!

కులగణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు రాష్ట్రం పూర్తిగా అంకితమైంది. ఈ మేరకు ఇప్పటికే అసెంబ్లీలో రెండు బిల్లులను ఆమోదించి, అవి రాజ్యాంగ 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరింది. ఆ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదానికి ఎదురుచూస్తున్నాయి. ఇంకా ఆమోదం రాకపోవడం, తిరస్కరణ కూడాకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్సు ద్వారా ముందడుగు వేసింది.

ఇప్పటికే రెండు బిల్లులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో, ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదమిస్తారా? లేదా? అనే సందేహం కొనసాగుతోంది. ప్రత్యేకించి అటార్నీ జనరల్ ఏ విధమైన న్యాయ సలహా ఇస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, అది రాష్ట్రానికి బలమైన అధికారాన్ని ఇస్తుంది. కానీ, సుప్రీం కోర్టు గతంలో చెప్పినట్లు మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదన్న నిబంధనను గవర్నర్ పరిగణనలోకి తీసుకుంటారేమో అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్ ప్రతికూల సలహా ఇస్తే, ఆ ఆధారంగా గవర్నర్ ఆర్డినెన్సును తిరస్కరిస్తే, బీజేపీపై విమర్శలు రావొచ్చని రాజకీయ వర్గాల్లో విశ్లేషణ సాగుతోంది. ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేకే బీజేపీ అడ్డుపడుతోందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపించే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రధాన అంశంగా ఇది మారే పరిస్థితి కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *