Earphones: మీరు ఇయర్‌ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నారా? గుండె దడేల్‌మనే షాకింగ్‌ న్యూస్‌!

Earphones: మీరు ఇయర్‌ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నారా? గుండె దడేల్‌మనే షాకింగ్‌ న్యూస్‌!


Earphones: ఇయర్‌ఫోన్‌, ఇయర్‌బడ్స్‌, బ్లూటుత్‌లు వినికిడి లోపాన్ని కలిగిస్తాయని వైద్య నిపుణులు పదేపదే చెబుతుంటారు. ఇయర్‌ఫోన్‌ వాడకం అనేది చాలా మందిలో పెరిగిపోతోంది. బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరు ఇయర్‌ఫోన్‌లను వాడుతున్నారు. ప్రత్యేకించి మీరు వాటిని ఎక్కువ సమయం, బిగ్గరగా ఉపయోగిస్తే వినికిడి సమస్య తలెత్తవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఇయర్‌ఫోన్‌లలో సంగీతాన్ని ఎంత బిగ్గరగా వింటే అంత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Honda Activa 6G: హోండా యాక్టివా 6G.. 316 కి.మీ మైలేజ్‌.. రూ.5 వేలు చెల్లిస్తే చాలు స్కూటీ మీ సొంతం!

మీరు కూడా గత 8 నుండి 10 సంవత్సరాలుగా ఇయర్‌ఫోన్‌లు ఉపయోగిస్తున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ వినికిడి సామర్థ్యం మునుపటి కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

వినికిడి లోపంతో పాటు చిరాకు, నిరాశ

నిపుణుల ప్రకారం.. సాధారణంగా లౌడ్ DJ ప్లే చేసే సమయంలో 60 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం హానికరం. 70 నుండి 80 డెసిబుల్స్ మధ్య ధ్వనిని నిరంతరం బహిర్గతం చేయడం వలన చెవుడు వస్తుంది. నెలలో 20 సార్లు 20 నిమిషాల పాటు 90 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం వింటే వినికిడి లోపం ఏర్పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

వినికిడి లోపం చికిత్స చేయకపోతే అది శాశ్వత అనారోగ్యానికి దారి తీస్తుంది. చెవులలో ధ్వని వినిపిస్తుంటుంది. చిరాకు, తలనొప్పి, తలతిరగడం, వికారం, నిరాశ సంభవించవచ్చు. కొందరికి హైబీపీ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇయర్‌ఫోన్‌ల నుండి వచ్చే ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాల వల్ల ఈ హాని కలుగుతుంది.

ఇయర్ ఫోన్స్ నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు కూడా తలనొప్పి, నిద్రలేమికి కారణమవుతాయి. దీని వల్ల పిల్లల చదువులు నేర్చుకునే సామర్థ్యం కూడా దెబ్బతింటోంది. దీని వల్ల చదువు విషయంలో గుర్తించుకోవాల్సిన అంశాలు, పనితీరు విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా తగ్గుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు

చెవులు క్లీనింగ్: ఇయర్‌ఫోన్స్ ఉపయోగించిన తర్వాత చెవులను శుభ్రం చేయండి.
వైద్యుడిని సంప్రదించండి: మీకు చెవి నొప్పి, దురద లేదా వినికిడి లోపం ఉంటే, వైద్యుడిని సంప్రదించండి.

ఇయర్‌ఫోన్‌ల వల్ల వినికిడి లోపం క్రమంగా జరుగుతుందని, ప్రారంభ లక్షణాలు ఉండవని గమనించడం ముఖ్యం. అందువల్ల మీరు ఇయర్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్త వహించడం ముఖ్యం. అలాగే మీ వినికిడిని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: Viral Video: ఏం తెలివిరా నాయానా..! ఇలాంటి దొంగతనం మీరు ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *