ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడనున్న కోహ్లీ కుటుంబ వారసుడు! విరాట్‌కు ఈ కుర్రాడు ఏమవుతాడంటే..?

ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడనున్న కోహ్లీ కుటుంబ వారసుడు! విరాట్‌కు ఈ కుర్రాడు ఏమవుతాడంటే..?


టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ కుటుంబం నుంచి ఓ కుర్ర క్రికెటర్‌ తొలి అడుగులు వేస్తున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ (DPL)లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ (SDS) జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. అయితే ఇతను విరాట్‌ కోహ్లీ లాగా బ్యాటర్‌ కాదు లెగ్‌ స్పిన్నర్‌. ఇంతకీ ఇతను విరాట్‌ కోహ్లీకి ఏమవుతాడంటే.. కొడుకు అవుతాడు. విరాట్ అన్నయ్య వికాస్ కుమారురే ఈ ఆర్యవీర్‌. ఇతన్ని DPL 2025 వేలంలో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ (SDS) లక్ష రూపాయలకు కొనుగోలు చేసింది. 15 ఏళ్ల ఈ యువకుడు భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత SDS కోచ్ శరణ్‌దీప్ సింగ్ వద్ద శిక్షణ పొందుతున్నాడు.

కోచ్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. “ఆర్యవీర్ కోహ్లీ ఒక అప్‌కమింగ్‌ స్టార్. అతను చాలా చిన్నవాడు. ఆర్యవీర్‌ ప్రతిభావంతమైన క్రికెటర్‌. ప్రాక్టీస్‌లో చాలా కష్టపడుతున్నాడు.” అని తెలిపారు. ఆర్యవీర్ వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు. అక్కడ కోచ్ రాజ్ కుమార్ శర్మ వద్ద కూడా శిక్షణ పొందాడు. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్‌లో చేరడం వల్ల అతను IPL స్టార్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకుంటాడు. ఈ టీమ్‌లో రాఠితో పాటు ఐపీఎల్‌లో అదరగొడుతున్న ప్రియాంష్ ఆర్య వంటి ఆటగాళ్ళు కూడా ఉన్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *