Miracle in Cricket: క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. శుక్రవారం జరిగిన టీ20 బ్లాస్ట్ మ్యాచ్‌లో ఇలాంటిదే ఒక అద్భుతం జరిగింది. క్రికెట్లో మరోసారి ఒక అద్భుతం జరిగింది. లీసెస్టర్‌షైర్, యార్క్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక సంచలన విజయం నమోదైంది. ఈ మ్యాచ్ ఉత్కంఠకు పరాకాష్టగా నిలిచింది. 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యార్క్‌షైర్ జట్టు 5.3 ఓవర్లలో కేవలం 23 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత జట్టు ఏదోలా కోలుకున్నప్పటికీ, చివరిలో మళ్లీ మ్యాచ్ చేజారిపోయింది. చివరి రెండు బంతుల్లో గెలవడానికి 10 పరుగులు అవసరం. అప్పటికే 8 వికెట్లు పడిపోయాయి. అందరు బ్యాట్స్మెన్లు అవుట్ అయిపోయినట్లే. అలాంటి సమయంలో ఒక బౌలర్ రెండు సిక్సర్లు కొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
ఆ బౌలర్ పేరు మ్యాట్ మిల్నెస్. మిల్నెస్ చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి, ఓడిపోయిన మ్యాచ్‌ను తన జట్టుకు గెలిపించాడు. అంతకుముందు, అబ్దుల్లా షఫీక్, మాథ్యూ రెవిస్ మ్యాచ్‌ను మలుపు తిప్పారు. వీరిద్దరూ ఐదవ వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అబ్దుల్లా 38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. రెవిస్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌షైర్ జట్టు రెహాన్ అహ్మద్ 43, బెన్ కాక్స్ 43 పరుగుల సహాయంతో 18.5 ఓవర్లలో 185 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అద్భుతమైన బ్యాటింగ్ చేసిన మ్యాట్ మిల్నెస్ బౌలింగ్‌లో మూడు వికెట్లు తీశాడు. సదర్లాండ్ కు కూడా 3 వికెట్లు దక్కాయి.
Crazy finishes for both Surrey vs Sussex and Leicestershire vs Yorkshire. Two sixes to win it for Yorkshire by Milnes pic.twitter.com/ih4LPvnn5G
— Cric Gold (@CricsGoldy) July 18, 2025
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ జట్టుకు ఆరంభం చాలా దారుణంగా ఉంది. విలియం లక్స్టన్ 0, కెప్టెన్ డేవిడ్ మలన్ 6, జేమ్స్ వార్టన్ 14, హ్యారీ డ్యూక్ 0 పరుగులకే అవుట్ అయ్యారు. ఆరో ఓవర్లో కేవలం 23 పరుగులకే 4 వికెట్లు పడిపోయాయి. ఆ తర్వాత అబ్దుల్లా షఫీక్, మాథ్యూ రెవిస్ మ్యాచ్‌ను మార్చారు. అయితే, చివరికి హీరోగా నిలిచింది మాత్రం మ్యాట్ మిల్నెస్. 19.3 ఓవర్లలో 175 పరుగుల వద్ద 8 వికెట్లు పడిపోయాయి. అంటే, చివరి 3 బంతుల్లో 11 పరుగులు అవసరం. కచ్చితంగా బౌండరీలు కావాల్సిన సమయంలో సింగిల్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు చివరి రెండు బంతుల్లో 10 పరుగులు కావాలి. మిల్నెస్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..