వర్షాకాలంలో డీహైడ్రేషన్‌తో తస్మాత్‌ జాగ్రత్త..! నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..అందుకే, ఈ టిప్స్ తప్పనిసరి..

వర్షాకాలంలో డీహైడ్రేషన్‌తో తస్మాత్‌ జాగ్రత్త..! నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..అందుకే, ఈ టిప్స్ తప్పనిసరి..


వేసవి కాలంలో మాత్రమే కాదు.. వర్షాకాలంలోనూ మనకు తెలియకుండానే డీహైడ్రేషన్ సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఈ డీహైడ్రేషన్‌ కారణంగా నీరసం వంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటికి వేడి వాతావరణం మాత్రమే కాదు.. తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు కూడా కారణం కావొచ్చు అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. వర్షాకాలంలో డీహైడ్రేషన్ వల్ల ప్రధానంగా జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లు, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది. వర్షాకాలంలోనూ హైడ్రేషన్ సమస్య పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

* రోజుకు సరిపడా నీటిని తీసుకోవటం చాలా ముఖ్యం..

చాలా మంది చేసే ఒక సాధారణ తప్పు ఏమిటంటే..వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం, తమ రోజువారీ కార్యకలాపాలు, పని ఒత్తడిలో పడి నీరు త్రాగటం మర్చిపోతుంటారు. ఇది మిమ్మల్నీ డిహైడ్రేషన్‌కు గురి చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. ప్రతి 30-45 నిమిషాలకు ఒకసారి తప్పనిసరిగా ఒక గ్లాస్‌ చొప్పున నీరు తాగటం తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. ఇది మీలో నిర్జలీకరణాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

* రోజువారీ ఆహారాల విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి..

మీరు తినే ఆహారం నుండి కూడా హైడ్రేషన్ వస్తుందని మీకు తెలుసా? వర్షాకాలంలో నీరు అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవటం తప్పనిసరి అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. బీరకాయ, సొరకాయ, దోస, కీర దోసకాయ వంటి కూరగాయలు, పుచ్చకాయ, నారింజ వంటి పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవన్నీ మన శరీరాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తోడ్పడుతుంది.

* డి హైడ్రేషన్‌ లక్షణాలు..

అలసట.. అకస్మాత్తుగా శరీరంలో శక్తి లేకపోవడం నిర్జలీకరణానికి సంకేతం. అంతేకాదు, పెదవులు, నోరు పొడిబారటం కూడా డి హైడ్రేషన్‌ లక్షణాలు. ఇది శరీరానికి ఎక్కువ ద్రవాలు అవసరమని సూచించే సాధారణ ప్రారంభ సంకేతాలుగా గుర్తించుకోవాలి. తగ్గిన మూత్రవిసర్జన, ముదురు పసుపు మూత్రం కూడా హైడ్రేట్ కావడానికి ఖచ్చితమైన సంకేతం. అంతేకాదు చిరాకుగా కూడా ఉంటుంది. మానసిక స్థితిలో అకస్మాత్తుగా మార్పు కొన్నిసార్లు నిర్జలీకరణం నుండి అసౌకర్యాన్ని సూచిస్తుంది. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎక్కువ నీరు, లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) వంటివి వెంటనే తీసుకోవాలి.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రకారం, విరేచనాలు లేదా వాంతులు వచ్చినప్పుడు ద్రవాలు మాత్రమే కాకుండా, ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు కూడా కోల్పోతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ (ORS) కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *