ESIC Scheme: కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం

ESIC Scheme: కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం


ESIC Scheme: దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలు, సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త అందించింది కేంద్రం. ఇటీవల ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ ఉద్యోగుల సామాజిక భద్రత పరిధిని విస్తరించడానికి SPREE పథకం 2025ను అమలు చేసింది. ఈ పథకం జూలై 1, 2025 నుండి డిసెంబర్ 31, 2025 వరకు అమలులో ఉంటుంది.

ఈఎస్‌ఐసీ చట్టం నిబంధనలకు లోబడి అర్హులైనప్పటికీ రిజిస్ట్రేషన్‌కు దూరంగా ఉన్న యాజమాన్యాలు, ఉద్యోగులు తమ వివరాలు నమోదు చేసేందుకు ప్రత్యేక పథకం ‘స్ప్రీ-2025’(స్కీమ్‌ టు ప్రమోట్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఎంప్లాయర్స్‌/ఎంప్లాయీస్‌ -SPREE)ను అమలు చేశారు. ఇందులో ఈ సంవత్సరం అంటే జూలై 1 నుంచి డిసెంబరు 31 వరకు తమ వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ రాజీవ్‌లాల్‌ పేర్కొన్నారు. ఏదైనా సంస్థలో 10 మంది అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటూ.. నెలకు రూ.21 వేలలోపు వేతనం పొందుతున్న ఉద్యోగులు తప్పనిసరిగా ఈఎస్‌ఐసీలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

అయితే క్షేత్రస్థాయి తనిఖీల్లో యాజమాన్యాలు, ఉద్యోగులు నమోదు కానట్లు గుర్తించినట్లయితే అధికారులు కేసులు నమోదు చేయడంతో పాటు బకాయిలు వసూలు చేస్తారు. అయితే ‘స్ప్రీ-2025’ కింద స్వచ్ఛందంగా వివరాలు నమోదు చేసుకున్న యాజమాన్యాలు గత సర్వీస్‌ కాలానికి ఎలాంటి చందా చెల్లించాల్సిన అవసరం లేదని ఈఎస్‌ఐసీ వెల్లడించింది. రిజిస్ట్రేషన్‌ చేసినప్పటి నుంచి ఉద్యోగుల సామాజిక, ఆరోగ్యభద్రత కోసం చందా తప్పనిసరిగా చెల్లించాలని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మళ్లీ అవకాశం:

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడానికి యజమానులు, ఉద్యోగుల నమోదును ప్రోత్సహించడానికి SPREE-2025 పథకాన్ని ప్రారంభించింది. మీరు ఒక కంపెనీ లేదా ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఇంకా ESIC కింద నమోదు చేసుకోకపోతే మళ్లీ అవకాం కల్పిస్తోంది.

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన సిమ్లాలో జరిగిన ESIC 196వ సమావేశం SPREE-2025 (యజమానులు, ఉద్యోగుల నమోదును ప్రోత్సహించే పథకం) ఆమోదించిందని గురుగ్రామ్ సబ్ రీజినల్ ఆఫీస్ ఇన్‌ఛార్జ్ సునీల్ యాదవ్ తెలిపారు. దీనిలో ఇంకా తమ ఉద్యోగులను బీమా పథకంలో చేర్చుకోని యజమానులు ఈ సమయంలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

1.02 కోట్ల మంది ఉద్యోగుల రిజిస్ట్రేషన్లు సులభతరం

యజమానులు/ఉద్యోగుల రిజిస్ట్రేషన్‌ను ప్రోత్సహించే పథకం 88,000 కంటే ఎక్కువ మంది యజమానులు, 1.02 కోట్ల మంది ఉద్యోగుల రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేసింది. ఈ పథకం కింద ఈ కాలంలో నమోదు చేసుకునే కంపెనీలు రిజిస్ట్రేషన్ తేదీ లేదా వారు ప్రకటించిన రిజిస్ట్రేషన్ తేదీ నుండి కవర్ అవుతున్నట్లు పరిగణించనున్నారు.

ఎస్‌పీఆర్‌ఈఈ 205 కీలక అంశాలు:

యాజమాన్యాలు తమ సంస్థలను, ఉద్యోగులను ఎస్‌ఐ పోర్టల్‌, శ్రామ్‌ సువిధా, ఎంసీఏ పోర్టల్స్‌ ద్వారా డిజిటల్‌ పద్దతిలో నమోదు చేసుకోవచ్చు. యజమాని ప్రకటించిన తేదీ నుంచే నమోదు చెల్లుబాటు అవుతుంది. రిజిస్ట్రేషన్‌కు ముందు కాలానికి ఎలాంటి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదు. పాత రికార్డుల పరిశీలన లేకుండానే పూర్తిగా కొత్త రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది కేంద్రం. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మరింత సులభతరం చేసి పెనాల్టీ భయాన్ని తొలగించడమే ఈ పథకం ప్రత్యేకత.

ప్రయోజనాలు:

ఈ స్కీమ్‌ ద్వారా ఇప్పటికి నమోదు కానీ సంస్థలు చట్టబద్దంగా ఈఎస్‌ ఐపరిధిలోకి వచ్చేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యంగా కాంటాక్ట్‌ ఉద్యోగులు, తాత్కాలిక కార్మికులు, వివిధ రంగాలలో పని చేసే వారికి ఆరోగ్య, సామాజిక భధ్రతా ప్రయోజనాలు అందించడానికి ఇది మంచి అవకాశం. ఈ పథకం ప్రారంభంతో కార్మిక సంక్షేమాన్ని బలోపేతం చేసేందుకు ఈఎస్‌ఐసీ ముందడుగు వేసిందని కార్మిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గత కాలానికి సంబంధించి చట్టపరమైన సమస్యలు ఎదుర్కొవాల్సిన అవసరం లేకుండా యాజమాన్యాలు స్వచ్చంధంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈఎస్‌ఐసీ సూచిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *