సెప్టెంబర్ 30 హైకోర్టు డెడ్‌లైన్…ఆలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.. అంతకంటే ముందు తెలంగాణ ప్రజానీకానికి ప్రభుత్వం ఇచ్చిన.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని నేరవేర్చాలి.. మరి ఇదంతా సాధ్యమేనా.. బీసీ ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ ఆమోదం పొందేనా.. ఇప్పుడివే అంశాలపై తెలంగాణ గడ్డపై హాట్‌హాట్ డిబేట్స్ నడుస్తుండగా.. సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై ఉత్కంఠ నడుస్తున్న వేళ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన హామీని నేరవేర్చుకుంటామన్న నమ్మకం ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించి ప్రజలకు మరింత చేరవుతామని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. దీనికోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పింది. ఇప్పటికే ఈ ఆర్డినెన్స్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వద్దకు చేరింది. దీంతో గవర్నర్ దీనికి ఆమోద ముద్ర వేస్తారా..? అన్నది సస్పెన్స్‌గా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీ సంఘాలు, కవిత వంటి వారు స్వాగతించారు. మరోవైపు రిజర్వేషన్లు పెంచే ఇష్టం లేకనే రేవంత్ ప్రభుత్వం అనేక సాకులు చెబుతుందని విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.
ఇటు ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకెళ్తున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా సర్వం సిద్ధం చేసింది. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..