వరుస హత్యలతో అట్టుడుకుతున్న బిహార్‌లో మరో మర్డర్ జరిగింది. రాజధాని పాట్నా లోని పారస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్‌స్టర్ చందన్ మిశ్రాను ప్రత్యర్థులు కాల్చిచంపారు. ఐదుగురు దుండగులు,ఐదు తుపాకులు , 50 సెకన్లలో చందన్ మిశ్రాను కాల్చి చంపి పరారయ్యారు. బక్సర్ జిల్లాకు చెందిన మాఫియా డాన్ చందన్ మిశ్రాపై 10 మర్డర్ కేసులు ఉన్నాయి. పారస్ ఆస్పత్రి ICUలో చికిత్స పొందుతున్న చందన్‌ను ఐదుగురు ప్రత్యర్ధులు కాల్చి చంపారు.కాల్పుల దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
17 రోజుల్లో బిహార్‌లో 46 హత్యలు జరగడం తీవ్ర సంచలనం రేపుతోంది. ఆస్పత్రి లోని రూమ్ నెంబర్ 209లో ఈ మర్డర్ జరిగింది. బాగల్పూర్ జైల్లో ఉన్న చందన్ మిశ్రాను చికిత్స కోసం కొద్దిరోజుల క్రితం ఆస్పత్రికి తరలించారు. బీజేపీ నేతల గోపాల్ ఖేమ్కాతో పాటు పలువురిని కాల్పి చంపిన ఘటనలు బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని నితీష్ సర్కార్‌పై విపక్షం మండిపడుతోంది. సినిమా స్లయిల్లో గ్యాంగ్‌స్టర్ చందన్‌మిశ్రా మర్డర్ జరిగింది. తాపీగా ఒకరి తరువాత ఒకరు షూటర్స్ ఆస్పత్రి లోని ICUలో ఉన్న రూమ్ నెంబర్ 209కి వచ్చారు. చందన్ మిశ్రాపై బుల్లెట్ల వర్షం కురిపించారు. బిహార్ జంగిల్‌రాజ్‌లా మారిందని ఆర్జేడీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చందన్ మిశ్రా ఎన్నోహత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
వీడియో చూడండి..
Shocker from Patna, Bihar:
CCTV footage shows 4 armed men storming an ICU ward at Paras Hospital and murdering a patient. What’s happening? pic.twitter.com/Iv77fYd21d— Asawari Jindal (@AsawariJindal15) July 17, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.