Andhra Pradesh: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఏపీపీఎస్సీ

Andhra Pradesh: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఏపీపీఎస్సీ


ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కల. ప్రభుత్వం జాబ్ కోసం కొందరు ఎన్నో ఏళ్లు కష్టపడుతుంటారు. ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కానీ ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీపై తాత్సారం చేస్తుంటాయి. ఇక ఏపీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే మెగా డీఎస్సీని నిర్వహించి.. 16,347 టీచర్ల పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అటవీ శాఖలో 691 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ – 435 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు జూలై 16 నుంచి అగస్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల సంఖ్య: 691

దరఖాస్తు ప్రారంభ తేదీ: జూలై 16, 2025

దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 5, 2025

విద్యార్హత: ఇంటర్మీడియట్

వయో పరిమితి: 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (కేటగిరీల వారీగా వయో సడలింపు ఉంటుంది)

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, హెల్త్ టెస్టులు

అప్లికేషన్ ఫీజు: ₹250 (అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు) + ₹80 (పరీక్ష ఫీజు). SC/ST/BC/PWD/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: www.psc.ap.gov.in

ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేయాలనుకునే అర్హత గల అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, పూర్తి నోటిఫికేషన్‌ను పరిశీలించి, జూలై 16 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *