అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్‌

అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్‌


జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రూపొందించిన ఈ ఏఐ సిస్టమ్‌కు ‘మార్స్’ (MAARS – Multimodal AI for Ventricular Arrhythmia Risk Stratification) అని పేరు పెట్టారు. ఇది కార్డియాక్ ఎంఆర్‌ఐ చిత్రాలను, రోగి ఆరోగ్య రికార్డులను సమగ్రంగా విశ్లేషించి, గుండెలో దాగి ఉన్న ప్రమాద సంకేతాలను గుర్తిస్తుంది. ముఖ్యంగా వైద్యులకు సైతం గుర్తించడం కష్టంగా ఉండే గుండె కండరాల మచ్చల నమూనాలను ఇది డీప్ లెర్నింగ్ టెక్నాలజీతో విశ్లేషిస్తుంది. నేచర్ కార్డియోవాస్కులర్ రీసెర్చ్ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. జన్యుపరంగా వచ్చే ‘హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి’ అనే గుండె జబ్బు ఉన్నవారిపై ఈ అధ్యయనం దృష్టి సారించింది. ప్రస్తుతం అమెరికా, ఐరోపాలో అనుసరిస్తున్న వైద్య మార్గదర్శకాలతో ప్రమాదాన్ని అంచనా వేయడంలో కచ్చితత్వం కేవలం 50 శాతంగా ఉంది. అయితే, ‘మార్స్’ మోడల్ ఏకంగా 89 శాతం కచ్చితత్వం చూపించింది. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ కచ్చితత్వం 93 శాతంగా ఉండటం విశేషం. సీనియర్‌ సైంటిస్ట్‌ నటాలియా ట్రయానోవా పరిశోధన గురించి వివరిస్తూ.. ప్రస్తుత విధానాల వల్ల కొందరు యువత ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు అనవసరంగా డీఫిబ్రిలేటర్లతో జీవించాల్సి వస్తోందన్నారు. ఈ ఏఐ మోడల్ ద్వారా ఎవరికి ఎక్కువ ముప్పు ఉందో అత్యంత కచ్చితత్వంతో చెప్పగలమని తెలిపారు. ప్రస్తుత అల్గారిథమ్‌లతో పోలిస్తే ఈ ఏఐ మోడల్ తమ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. ఇది వైద్య సంరక్షణలో మార్పు తీసుకురాగలదని కార్డియాలజిస్ట్ జోనాథన్ క్రిస్పిన్ అన్నారు. ఈ మోడల్‌ను మరింత మంది రోగులపై పరీక్షించి, ఇతర గుండె జబ్బుల పరీక్షలకు కూడా విస్తరించాలని పరిశోధకుల బృందం యోచిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం

ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *