Tollywood: ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు సెకనుకు 10 లక్షల రెమ్యునరేషన్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ రేంజ్ వేరే లెవెల్

Tollywood: ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు సెకనుకు 10 లక్షల రెమ్యునరేషన్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ రేంజ్ వేరే లెవెల్


కేరళలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టింది. నటనపై ఉన్న ఆసక్తి తో అనేక అవమానాలు, అడ్డంకులను ఎదుర్కొని హీరోయిన్‌గా సక్సెస్ అయ్యింది. దక్షిణాదిలోనే టాప్ హీరోయిన్ అవుతుందని బహుశా ఆమె కూడా ఊహించి ఉండకపోవచ్చు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతోంది. గతంలో తన రెమ్యునరేషన్ కారణంగా పలు సార్లు వార్తల్లో నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరోసారి అదే విషయంతో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఒక 50 సెకెన్ల ప్రకటనలో నటించిడానికి ఆమె రూ. 5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. అంటే సెకనుకు అక్షరాలా రూ. 10 లక్షలు అన్నమాట. ఇలా రికార్డు రెమ్యునరేషన్ తో వార్తల్లో నిలిచిన ఆ హీరోయిన్ మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయన తార.

ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటోన్న నయన తార అరుదుగా మాత్రమే ప్రకటనల్లో నటిస్తోంది. అయితే ఇటీవల, 50 సెకన్ల టాటా స్కై ప్రకటనలో నటించడానికి ఆమె రూ. 5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ యాడ్ షూట్ రెండు రోజుల పాటు జరిగిందని సమాచారం. ప్రస్తుతమున్న స్టార్ హీరోలు కూడా ఒక్క యాడ్‌కు ఇంత రెమ్యునరేషన్ తీసుకోరు. కానీ నయనతార మాత్రం తన రికార్డు రెమ్యునరేషన్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

నయన తార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. దీంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు కూడా ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *