Fire Accident: డీజిల్‌ తీసుకెళ్తున్న గూడ్స్‌ ట్రైన్‌లో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు!

Fire Accident: డీజిల్‌ తీసుకెళ్తున్న గూడ్స్‌ ట్రైన్‌లో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు!


ఆదివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో మానాలి నుంచి తిరుపతికి డీజిల్‌ తీసుకువెళ్తున్న గూడ్స్‌ రైలు తిరువళ్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. రైలులోని నాలుగు వ్యాగన్లలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించడంతో.. భారీగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ట్రైన్‌ బోగీలలో ఉన్నది మండే స్వభావం గల ఇంధనం కావడంతో ఘటనా ప్రాంతంలో మంటలు భారీగా ఎగిసిపడ్డుతున్నాయి. మంటలతో పాటు భారీ ఎత్తున పొగ కూడా వెలువడడంతో సమీప ప్రాంతాల్లో మొత్తం పొగ కమ్ముకుంది.

ఇక స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు ప్రమాద సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అనంతరం ఫైరింజన్ల ద్వారా మంటలను అదుపుచేయే ప్రయత్నం స్టార్ట్ చేశారు. గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశాయి. ప్రమాదంలో గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు.

ఈ ప్రమాదంపై ఫైర్‌సెఫ్టీ చీఫ్ సీమా అగర్వాల్ మాట్లాడుతూ సమాచారం అందిన వెంటనే మా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ట్రైన్‌లో ఉన్నది మండే స్వభావం గల డీజిల్ ఇంధనం కావడంతో.. త్వరగా మంటలను అదుపులోకి తీసుకురాలేకపోయారు. దీంతో మరికొంత మంది అదనపు సిబ్బందిని రప్పించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

వీడియో చూడండి..

మరోవైపు ఈ అగ్నిప్రమాదం కారణంగా చెన్నైకి వెళ్లే రైలు సర్వీసులు నిలిచిపోయాయి. చెన్నై నుంచి బయల్దేరిన 8 రైళ్లను అధికారులు రద్దు చేయగా.. మరో ఐదు రైళ్లను దారి మళ్లించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *